https://oktelugu.com/

Rajamouli : నా కొడుకుతో మూవీ ఎప్పుడు చేస్తావ్ అంటూ రాజమౌళిని టార్చర్ చేసిన సీనియర్ హీరో.. కానీ అసలుకే ఎసరు?

రాజమౌళితో మూవీ చేస్తే ఆ హీరో ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది. ఖచ్చితంగా ఒక మెట్టు పైకి ఎదుగుతాడు. ఇది పలువురు హీరోల విషయంలో రుజువైంది. ఈ క్రమంలో బ్రేక్ రాక అల్లాడుతున్న తన కొడుకుతో మూవీ చేయమని ఓ సీనియర్ హీరో రాజమౌళిని టార్చర్ చేశాడట. చివరికి అసలుకే దెబ్బ తిన్నాడట. ఆ కథేమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 21, 2024 / 06:24 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli :  రాజమౌళితో మూవీ చేయాలని అందరూ కోరుకుంటారు. కొందరికే ఆ కల నెరవేరుతుంది. రాజమౌళి ముగ్గురు హీరోలతో రిపీటెడ్ గా సినిమాలు చేశాడు. అత్యధికంగా ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలు చేశాడు. ప్రభాస్ తో మూడు, రామ్ చరణ్ తో రెండు సినిమాలు చేశాడు. చేసిన హీరోలతోనే సినిమాలు చేసిన రాజమౌళి… అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. అదే సమయంలో సునీల్, నాని వంటి హీరోలకు ఆయనతో పని చేసే ఛాన్స్ రావడం విశేషం.

    రాజమౌళితో మూవీ కన్ఫర్మ్ అయ్యిందంటే ఒక హిట్ ఖాతాలో వేసుకున్నట్లే. రికార్డుల గురించి మాత్రమే ఆలోచించాలి. పరాజయం అనే మాటుండదు. ఈ క్రమంలో పలువురు హీరోలు తమకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాజమౌళితో మూవీ ఛాన్స్ కొట్టేయాలని చూస్తారు. కొందరు నేరుగా కలిసి తమ కోరిక బయటపెడతారు. కాగా కెరీర్లో ఒక్క బ్లాక్ బస్టర్ లేని తన కొడుకు కోసం ఓ సీనియర్ హీరో రాజమౌళిని టార్చర్ చేశాడట. కుమారుడితో మూవీ చేయాలని పదే పదే విసిగించాడట.

    ఆ సీనియర్ హీరో ఎవరో కాదు మోహన్ బాబు అట. ఎన్టీఆర్-రాజమౌళి కాంబోలో వచ్చిన మూడో చిత్రం యమదొంగ. సోషియో ఫాంటసీ జానర్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. ఈ మూవీలో యముడి పాత్రకు మోహన్ బాబును తీసుకున్నారు. తనదైన మార్క్ నటనతో మోహన్ బాబు యముడిగా అలరించాడు. ఎన్టీఆర్-మోహన్ బాబు కాంబినేషన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ మూవీ షూటింగ్ లో రాజమౌళిని మోహన్ బాబు తన పెద్ద కొడుకు విష్ణుతో మూవీ చేయాలని రిక్వెస్ట్ చేశాడట.

    సరే వీలు చూసుకుని చేస్తానని రాజమౌళి చెప్పారట. కానీ ప్రతిరోజు ఇదే విషయం గుర్తు చేస్తూ ఎలాగైనా ప్రాజెక్ట్ ఓకే చేయించాలని మోహన్ బాబు ప్రయత్నం చేశారట. ఒక దశలో మోహన్ బాబు తీరుకు రాజమౌళి విసిగిపోయాడట. ఇకపై తన చిత్రాల్లో మోహన్ బాబును తీసుకోకూడదని డిసైడ్ అయ్యాడట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విష్ణు హీరోగా స్ట్రగుల్ అవుతున్నారు. విష్ణు కెరీర్లో ఢీ మాత్రమే హిట్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం ఆయన కన్నప్ప టైటిల్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.