https://oktelugu.com/

Lucky Bhaskar movie Collections : లక్కీ భాస్కర్’ 3 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. నైజాంలో ఇలాంటి రన్ ‘దేవర’ కి కూడా రాలేదుగా!

నిన్నటితో మూడు వారాలు విజయవంతంగా థియేటర్స్ లో బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మూడవ వారంలో 2 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 21, 2024 / 05:40 PM IST

    Lucky Bhaskar movie Collections

    Follow us on

    Lucky Bhaskar movie Collections :  మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నెమ్మదిగా మన తెలుగు హీరో అయిపోతున్నాడు. ‘మహానటి’ చిత్రం ద్వారా తొలిసారి డైరెక్ట్ తెలుగు సినిమాతో మన ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్, ఆ తర్వాత ‘సీతారామం’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మన ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఈ చిత్రం తర్వాత ఆయన ప్రభాస్ ‘కల్కి’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించి మన ఆడియన్స్ కి మరికొంత దగ్గర అయ్యాడు. ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మన తెలుగు హీరోలలో ఒకడిగా నిలిచిపోయాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఓపెనింగ్స్ నుండే సత్తా చాటుతూ వచ్చిన ఈ సినిమా, లాంగ్ రన్ లో కూడా కళ్ళు చెదిరే వసూళ్లను నమోదు చేస్తూ రీసెంట్ గానే 100 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కూడా అందుకుంది.

    నిన్నటితో మూడు వారాలు విజయవంతంగా థియేటర్స్ లో బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మూడవ వారంలో 2 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల 31 లక్షల షేర్ వసూళ్లు, 34 కోట్ల 40 లక్షల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి మూడు వారాలకు కలిపి వచ్చినట్టు సమాచారం. నైజాం ప్రాంతం లో అయితే ఈ సినిమాకి ఇప్పటికీ డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లు వస్తూనే ఉన్నాయి. దేవర చిత్రానికి కూడా ఈ ప్రాంతంలో ‘లక్కీ భాస్కర్’ రేంజ్ స్టడీ థియేట్రికల్ రన్ రాలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. 3 వారాలకు నైజాం ప్రాంతంలో 9 కోట్ల 33 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో 10 కోట్ల రూపాయిల మార్కుని దాటనుంది ఈ చిత్రం.

    ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కేరళ లో 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక లో 6 కోట్ల 20 లక్షలు, తమిళనాడులో 14 కోట్ల 20 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2 కోట్ల 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అయితే మన స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో ఏకంగా 27 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా మూడు వారాలకు ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 51 కోట్ల 20 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో కచ్చితంగా మరో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.