https://oktelugu.com/

Amaran Movie  Collections : ‘దేవర’ వసూళ్లను దాటేసిన ‘అమరన్’..5వ రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి, 10 కోట్ల 57 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అంటే పెట్టిన ప్రతీ పైసాకి రెండింతలు లాభం వచ్చిందన్నమాట. వరల్డ్ వైడ్ గా కూడా ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 5 రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 7:28 pm
    Amaran Movie  Collections

    Amaran Movie  Collections

    Follow us on

    Amaran Movie  Collections : మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ని ఆధారంగా చేసుకొని ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ‘అమరన్’. శివ కార్తికేయన్ హీరో గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలుగు లో అయితే ఈ సినిమా అప్పుడే కమర్షియల్ గా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి, 10 కోట్ల 57 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అంటే పెట్టిన ప్రతీ పైసాకి రెండింతలు లాభం వచ్చిందన్నమాట. వరల్డ్ వైడ్ గా కూడా ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 5 రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

    తమిళనాడు లో ఇప్పటికే ఈ చిత్రానికి 74 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొదటి వారం ముగిసేలోపు కచ్చితంగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కేవలం తమిళనాడు నుండే వస్తుందని ఆశిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన వెట్టియాన్ ఫుల్ రన్ లో 99 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రజినీకాంత్ లాంటి సూపర్ సినిమా క్లోజింగ్ వసూళ్లను శివ కార్తికేయన్ లాంటి మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న హీరో వారం రోజుల్లో దాటేయడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే విధంగా కర్ణాటకలో 9 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టగా, కేరళలో 5 కోట్ల 10 లక్షల రూపాయిలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి 30 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ లో 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యినట్టు తెలుస్తుంది.

    ఓవరాల్ గా 5 రోజులకు కలిపి ఈ సినిమాకి 155 కోట్ల రూపాయిల గ్రాస్, 77 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వారం రోజులు ముగియకముందే ఒక సినిమాకి ఇంత వసూళ్లు రావడం కేవలం మనం సూపర్ స్టార్స్ కి మాత్రమే ఇది వరకు చూసాము. అంటే ఈ లెక్కన శివ కార్తికేయన్ కూడా సూపర్ స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టినట్టే. ఇది ఇలా దేవర చిత్రానికి 5 వ రోజు కేవలం 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. కానీ ‘అమరన్’ చిత్రానికి 5 వ రోజు ఏకంగా 9 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 19 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ లో కూడా ఈ సినిమా ‘దేవర’ క్లోజింగ్ ని దాటే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.