Kia Cars: కొర్ల కొనుగోలు శక్తి రోజురోజుకు పెరిగి పోతుంది. వివిధ అవసరాల కోసం కొంత మంది సొంత కార్లు ఉండాలని కోరుకుంటున్నారు. కొందరు తక్కువ ధరలో ఉండే హ్యాచ్ బ్యాక్ కార్లను కొనుగోలు చేస్తుంటే మరికొందరు ప్రీమియం కార్ల కోసం సెర్చ్ చేస్తున్నారు. అయితే అన్ని రకాల కార్లన అందించేందకు Kia కంపెనీ ముందు ఉంటోంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ దేశీయ కంపెనీలతో పోటీ పడుతూ వినియోగదారులకు అనుగుణంగా ఉండే వెహికల్స్ ను అందుబాటులో ఉంచుతోంది. Kia కంపెనీ నుంచి ఇప్పటి వరకు సెల్టోస్, సోనెట్, కారెన్స్ వంటి మోడళ్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. వీటితో పాటు EV6 అనే ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ దీపావళి సందర్భంగా కియా కార్లు అమ్మకాల్లో రికార్డు సృష్టించాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Kia Company కార్ల ఉత్పత్తి దేశంలోని ఆంధ్రప్రదేశ్లో 2019లో ప్రారంభం అయింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంపురంలో నెలకొన్న ప్లాంట్ ద్వారా ఇప్పటి వకు 10.5 లక్షల యూనిట్లను దేశవ్యాప్తంగా అందించింది. విదేశీ గడ్డపై మేడ్ ఇన్ ఇండియా కార్లు 2.5 లక్షలు ఉన్నాయి. అలాగే ఈ కంపెనీ ప్రస్తుతం 287 నగరాల్లో నెట్ వర్క్ ను కలిగి ఉంది. ప్రస్తుతం కియా వార్షిక వాహనాల ఉత్పత్తి 3 లక్షల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే ఏడాదిలో వినియోగదారులకు అవసరమైన కార్లను అందించగలుగుతుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఫీచర్స్, డిజైన్లను మార్చి మార్కెట్లోకి వస్తున్న కియా కార్లు ఏడాదికెడాది సేల్స్ పెరుగుతున్నాయి.
తాజాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం కియా కార్లు 2023 అక్టోబర్ లో 21, 941 ఉన్నాయి. 2024 అక్టోబర్ లో ఇవి 28,545 ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ లో 30 శాతం వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో దీపావళి పండుగ సందర్భంగా ఈ సేల్స్ నమోదు అయినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిలో కియా కార్నివాల్ పై వినియోగదారులు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నార్మల్ కార్లకంటే ప్రీమియం కార్లపైనే మోజు పెంచుకుంటున్నారు.
మేడ్ ఇన్ ఇండియా కియా కార్లకు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తయారైన కార్లు స్టాండర్డ్ ఎక్కువగా ఉండడంతో విదేశీయలు ఈ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా మిగతా కార్ల కంటే మేడ్ ఇన్ ఇండియా కియా కార్లకు ఎక్కువగా ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం కియా నుంచి రిలీజ్ అయిన ఎంపీవీ కార్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఉన్న ఫీచర్లు వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.
ఆటోమోబైల్ రంగంలో కార్ల కంపెనీల మధ్య పోటీ ఉన్నప్పటికీ కియా కార్లపై ఎక్కువగా ఆసక్తి చూపడం విశేషం. అలాగే రానున్న రోజుల్లోనూ కియా కార్లకు ఎక్కువగా ఆదరణ పెరుగుతుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అయితే వినియోగదారులు కోరుకునుే విధంగా ఫీచర్లు, లేటేస్ట్ టెక్నాలజీని అమరుస్తున్నట్లు కంపెనీకి చెందిన వారు చెబుతున్నారు.