https://oktelugu.com/

Amaran Movie Collection : అమరన్’ 18 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..సౌత్ లో ‘దేవర’, ‘కల్కి’ రికార్డ్స్ డేంజర్ లో పడిపోయాయిగా!

తెలుగునాట సూపర్ స్టార్ రజినీకాంత్, సూర్య తర్వాత శివ కార్తికేయన్ కి మంచి మార్కెట్ ఈ సినిమా ద్వారా ఏర్పడింది అని చెప్పొచ్చు. కేవలం 5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని తెలుగు వెర్షన్ కి జరుపుకున్న ఈ చిత్రం 18 రోజులకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

Written By: Vicky, Updated On : November 18, 2024 9:13 pm
Amaran Movie Collection

Amaran Movie Collection

Follow us on

Amaran Movie Collection :  తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అమరన్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో సరికొత్త మైల్ స్టోన్ ని అధిగమిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళం లో మాత్రమే కాకుండా, తెలుగు లో కూడా ఈ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి. దీపావళి కానుకగా ఈ సినిమాతో పాటు విడుదలైన ‘క’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాల వసూళ్లను కూడా ఈ సినిమా తెలుగు లో డామినేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతోందంటే, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు, తెలుగునాట సూపర్ స్టార్ రజినీకాంత్, సూర్య తర్వాత శివ కార్తికేయన్ కి మంచి మార్కెట్ ఈ సినిమా ద్వారా ఏర్పడింది అని చెప్పొచ్చు. కేవలం 5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని తెలుగు వెర్షన్ కి జరుపుకున్న ఈ చిత్రం 18 రోజులకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న ఒక్కరోజే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిందట. ఇది సాధారణమైన విషయం కాదు. 18 రోజులకు గాను నైజాం ప్రాంతంలో 10 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతంలో రెండు కోట్ల 80 లక్షలు, ఆంధ్ర ప్రాంతంలో 9 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 18 రోజులకు గాను ఈ సినిమా 22 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కేవలం తెలుగు వెర్షన్ నుండి రాబట్టింది. 5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టబోతుంది అంటే ఎంత పెద్ద హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.

ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడులో 140 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక లో 21 కోట్ల రూపాయిలు, కేరళలో 11 కోట్ల రూపాయిలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నార్త్ అమెరికా సహకారం భారీగా లేకపోయినా కూడా 77 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 294 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 144 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈరోజో రేపో 300 కోట్ల రూపాయిల మార్కుని అందుకోబోతుంది. త్వరలో దేవర వసూళ్లను ఈ సినిమా అధిగమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.