https://oktelugu.com/

Lucky Bhaskar Movie : లక్కీ భాస్కర్’ 18 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తమిళనాడు లో ప్రభంజనం..’కంగువా’ ని కూడా దాటేసిందిగా!

విడుదలై 18 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా, ప్రాంతాలవారీగా, ఎంత షేర్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 18 రోజులకు కలిపి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 18, 2024 / 09:09 PM IST

    Lucky Bhaskar Movie Collections

    Follow us on

    Lucky Bhaskar Movie :  మలయాళం స్టార్ హీరోలలో మనకి ఒకప్పుడు మమ్ముటి, మోహన్ లాల్ వంటి వారు తప్ప, మిగిలిన వాళ్ళెవ్వరు పెద్దగా తెలియదు. కానీ మమ్ముటి కొడుకు దుల్కర్ సల్మాన్ మాత్రం మన ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాడు. ముఖ్యంగా యూత్ లో ఈయనకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. మహానటి చిత్రంతో ఈయన మన టాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అంతకు ముందు ఈయన కొన్ని మలయాళం డబ్బింగ్ సినిమాల ద్వారా మన ముందుకి వచ్చాడు కానీ, ఆడియన్స్ కి దుల్కర్ పేరు బాగా రిజిస్టర్ అయ్యింది మాత్రం మహానటితోనే. కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘సీతారామం’ చిత్రం చేసాడు. ఇది మహానటిని మించిన హిట్ అయ్యింది. అలా ఈ రెండు సినిమాతో మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించిన ఈయన,రీసెంట్ గా లక్కీ భాస్కర్ చిత్రం తో మరో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు.

    విడుదలై 18 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా, ప్రాంతాలవారీగా, ఎంత షేర్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 18 రోజులకు కలిపి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నైజాం ప్రాంతంలో 9 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వస్సూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ లో 2 కోట్ల 70 లక్షల రూపాయిలు, ఆంధ్ర లో 8 కోట్ల 15 లక్షల రూపాయిలను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 34 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కేరళలో 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటకలో 6 కోట్ల రూపాయిలను, ఓవర్సీస్ లో 27 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    ఇక తమిళనాడు లో అయితే ఈ సినిమా చిన్న సైజు సునామి చూపించిందని చెప్పొచ్చు. 18 రోజులకు కలిపి ఈ ప్రాంతంలో ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ళు వచ్చాయి. ప్రస్తుతం అక్కడ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ చాలా స్టడీ గా ఉంది. పరిస్థితి చూస్తూ ఉంటే ఈ సినిమా కచ్చితంగా త్వరలో సూర్య కంగువా క్లోజింగ్ గ్రాస్ వసూళ్లను దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. వీకెండ్ లో కూడా ఈ చిత్రం తమిళనాడులోని అనేక ప్రాంతాలలో ‘కంగువా’ చిత్రానికంటే ఎక్కువ వసూళ్లను రాబట్టిందట. ఇదే ట్రెండ్ ఒక రెండు వీకెండ్స్ నడిస్తే ‘లక్కీ భాస్కర్’ చిరం కేవలం తమిళనాడు నుండే 30 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తుంది. ఓవరాల్ గా 18 రోజులకు కలిపి ఈ చిత్రానికి 104 కోట్ల రూపాయిల గ్రాస్, 51 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.