Amar Deep in Bigg Boss 9: తెలుగు బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హిస్టరీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు అమర్ దీప్(Amardeep Chowdary). సీజన్ 7 రన్నరప్ గా నిల్చిన అమర్ దీప్ కి బుల్లితెర లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారమైనది కాదు. ఒక మీడియం రేంజ్ హీరో కి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. సీజన్ 7 అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం అమర్ దీప్. ఆయన కారణంగానే బోలెడంత బ్లాక్ బస్టర్ కంటెంట్ వచ్చింది. ఈ సీజన్ తర్వాత ఆయన ఎలాంటి సీరియల్ లో నటించలేదు కానీ, వరుసగా మూడు సినిమాల్లో హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాల షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఖాలీగానే ఉన్నాడు కాబట్టి, బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 9 లో రాయల్ కార్డు ద్వారా హౌస్ లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
బుల్లితెర లో కేవలం అమర్ దీప్ కోసమే చూసే ఆడియన్స్ లక్షల్లో ఉంటారు. ఆయన్ని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని వస్తే కచ్చితంగా సీజన్ కి బాగా ఉపయోగపడుతుందని, టీఆర్ఫీ రేటింగ్స్ డబుల్ అవుతాయని బిగ్ బాస్ టీం ఉద్దేశ్యం. అమర్ దీప్ వైపు నుండి తుది నిర్ణయం బయటకు రావాల్సి ఉంది. ఒకవేళ ఆయన ఒప్పుకొని సంతకం చేస్తే, ఈ వారం లోనే బిగ్ బాస్ హౌస్ లోకి పంపే అవకాశాలు ఉన్నాయట. ఒకప్పటి తో పోలిస్తే ఇప్పుడు అమర్ దీప్ క్రేజ్ బాగా పెరిగింది కాబట్టి , ఆ క్రేజ్ కి తగ్గట్టే రెమ్యూనరేషన్ ని కూడా డిమాండ్ చేస్తున్నాడట అమర్ దీప్. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయనకు వారానికి నాలుగు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి బిగ్ బాస్ టీం అంగీకరించిందట.
ఇక అమర్ దీప్ అగ్రిమెంట్ మీద సంతకం చేయడమే మిగిలింది. తన సినిమాల కమిట్మెంట్స్, డేట్స్ ని చూసుకొని చెప్తానని అమర్ దీప్ అన్నాడట. మరో రెండు రోజుల్లో అమర్ దీప్ వస్తున్నాడా లేదా అనేది ఖరారు కానుంది. ఒకవేళ అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే గౌతమ్ లాగా రన్నరప్ రేంజ్ కి వెళ్తాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే బిగ్ బాస్ హిస్టరీ లో ఒక వైల్డ్ కార్డు కంటెస్టెంట్ రన్నర్ స్థాయికి వెళ్లడం అనేది ఇప్పటి వరకు హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు. కేవలం గౌతమ్ విషయం లోనే జరిగింది. అమర్ దీప్ ఆ ఫీట్ ని రిపీట్ చేస్తాడా?, లేదా అంతకు మించి అన్నట్టు ఏకంగా టైటిల్ గెలుస్తాడా అనేది చూడాలి. టైటిల్ గెలిచేంత సత్తా, ఫ్యాన్ బేస్ అమర్ దీప్ కి ఉంది, చూడాలి మరి ఏమి జరుగుతుంది అనేది.