Mahesh Babu in Paradise: సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల హవా ఎక్కువైపోయింది. వాళ్ల నుంచి వస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే విధంగా చూసుకుంటున్నాడు. ఉండే విధంగా చూసుకుంటూ మంచి సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుండడం విశేషం…ప్రస్తుతం నాని లాంటి హీరో సోలోగా ఇండస్ట్రీకి వచ్చి మంచి విజయాలను అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్యారడైజ్ పేరు తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఒక చిన్న గ్లింప్స్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ గ్లింప్స్ తోనే సినిమా మీద హైప్ అయితే క్రియేట్ అయింది. ఇది చాలా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక భాగం అవ్వబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. కారణం ఏంటి అంటే మహేష్ బాబు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నారట. ఇప్పటికే మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి.
కాబట్టి ఈ సినిమాకి తన వాయిస్ ఓవర్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందని వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే నానితో దసర సినిమా చేశాడు. ఆ మూవీ సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇప్పుడు చేస్తున్న ఈ ప్యారడైజ్ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఈ సినిమా తర్వాత ఆయన చిరంజీవితో ఒక భారీ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక అన్ని అనుకున్నట్టుగా కుదిరితే మాత్రం శ్రీకాంత్ ఓదెల ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా మారిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…