https://oktelugu.com/

Revanth Reddy: తన ఇంటి పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.. రేవంత్ రెడ్డి

కేటీఆర్ పంపిన టిఆర్ఎస్ గుండాలు తన ఇంటిపై తన అనుచరులపై దాడి చేశారని రేవంత్ రెడ్డి జూబ్లీహిత్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారన్నారు. అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కొంతమంది తమా కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించకుండా అటు ఇటు తిప్పుతునట్టు సమాచారం ఉంది. తమ కార్యకర్తలపై […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 22, 2021 / 12:54 PM IST
    Follow us on

    కేటీఆర్ పంపిన టిఆర్ఎస్ గుండాలు తన ఇంటిపై తన అనుచరులపై దాడి చేశారని రేవంత్ రెడ్డి జూబ్లీహిత్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారన్నారు. అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.

    కొంతమంది తమా కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించకుండా అటు ఇటు తిప్పుతునట్టు సమాచారం ఉంది. తమ కార్యకర్తలపై తర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగిస్తే ఊరుకునేది లేదు. మ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. పోలీసుల కనుసన్నల్లోనే తన ఇంటిపై దాడి జరిగింది. కొంతమంది బీహార్ కు చెందిన పోలీస్ అధికారులను ఉన్నత స్థాయిలో నియమించి తెలంగాణను బీహార్ రాష్ట్రం గా మార్చాలని కేసీఆర్ చూస్తున్నారు.

    ప్రభుత్వ అడుగులకు మడుగుల ఒత్తే అధికారుల వివరాలను మా డైరీలో రాసుకుంటాం. మా ప్రభుత్వం అధికారం లోకి వచ్చాకా అలాంటి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం.  తనకు అదనపు భద్రత కల్పించే విషయంలో మరోసారి కోర్ట్ కెళ్తాము. గతంలో తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మోడీ ప్రభుత్వం ఒక్క సంతకంతో తమ పార్టీకి చెందిన వంద మందికి భద్రత కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించినపుడు తన భద్రత విషయంలో మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు.