Good Bad Ugly Movie : తమిళ హీరో అజిత్(Thala Ajith) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు ఈ చిత్రం చాలా స్టడీ రన్ ని సొంతం చేసుకుంది కానీ, 15 వ రోజు(నిన్న) మాత్రం భారీ డ్రాప్స్ ని నమోదు చేసుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం 15వ రోజున ఈ చిత్రానికి కోటి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. అంతకు ముందు రోజున మూడు కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సడన్ గా సగానికి పైగా వసూళ్లు తగ్గిపోవడం తమిళనాడు ట్రేడ్ ని కాస్త నిరాశపర్చింది.
Also Read : నాని హిట్ 3 సెన్సార్ రిపోర్ట్, వాళ్లకు నో ఎంట్రీ!
ఓవరాల్ గా ఈ చిత్రానికి 15 రోజుల్లో తమిళనాడు ప్రాంతం నుండి 143.40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఆల్ టైం టాప్ 10 చిత్రం గా నిల్చిందని అంటున్నారు అక్కడి ట్రేడ్ విశ్లేషకులు. ఈరోజు బుక్ మై షో యాప్ లో #BOGO ఆఫర్ ఉండడం తో నిన్నటితో పోలిస్తే నేడు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కర్ణాటక లో 14 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళలో 3 కోట్ల 35 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి దాదాపుగా 62 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రావొచ్చు. ఓవరాల్ గా ఈ చిత్రానికి 15 రోజుల్లో 232 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఈ వీకెండ్ తో కచ్చితంగా 250 కోట్ల మార్కుకి దగ్గరగా వస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసిన ఈ సినిమాకు ఇంత వసూళ్లు రావడం అనేది సాధారమైన విషయం కాదు. సెకండ్ హాఫ్ కి జనాల్లో టాక్ బాగాలేదు, ఒకవేళ ఫస్ట్ హాఫ్ రేంజ్ లో సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే ఈ చిత్రం మరో లెవెల్ కి వెళ్లి ఉండేదని, తమిళనాడు లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చెదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అజిత్ రాబోయే రోజుల్లో అయినా మంచి కంటెంట్ ఉన్న సబ్జక్ట్స్ చేయాలనీ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో రెండు కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది
Also Read : సీరియల్ లో తల్లి పాత్రలో పద్ధతిగా.. నెట్టింట్లొ మాత్రం అందాలతో సెగలు…