SS Rajamouli : సాధారణంగా రాజమౌళి(SS Rajamouli) తన ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు స్టోరీ మొత్తం ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి చెప్పేస్తాడు. ఎందుకంటే ఆయన ఆడియన్స్ కి తన సినిమా ఎలా ఉండబోతుంది అనే దానిపై ఒక క్లారిటీ, విజన్ ఇచ్చేస్తాడు. ఆ క్లారిటీ కి మించి అద్భుతంగా చిత్రాన్ని చెక్కి ఆడియన్స్ కి అందిస్తూ ఉంటాడు. అవి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తూ ఉంటాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్స్ కలిసి నటించిన మల్టీస్టార్రర్ #RRR కి కూడా ఆయన షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి కథ మొత్తాన్ని చెప్పేసాడు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు(Super Star Mahesh Babu) సినిమాకు సంబంధించి మాత్రం ఎందుకో ఆయన చాలా మౌనంగా వ్యవహరిస్తున్నాడు. షూటింగ్ మొదలై ఒడిశా లో ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.
Also Read : 15వ రోజు దారుణంగా పడిపోయిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వసూళ్లు..ఇలా అయితే కష్టమే!
మే నెలలో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. అంతే కాకుండా రామోజీ ఫిలిం సిటీ లో గుట్టు చప్పుడు కాకుండా కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించారట. అంత బాగానే ఉంది కానీ, ఇప్పటి వరకు కనీసం రాజమౌళి మా సినిమా షూటింగ్ మొదలైంది అనే అప్డేట్ కూడా ఇవ్వలేదు. ప్రెస్ మీట్ కోసం అభిమానులు చకోరి పక్షులు లాగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. కనీసం పుట్టినరోజు కి కూడా అప్డేట్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. రాజమౌళి తీరుని చూస్తుంటే ఈ సినిమాకు సంబంధించి ప్రతీ ఒక్కటి గోప్యంగా ఉంచాలని, షూటింగ్ మొత్తం పూర్తి అయ్యాక ఒక అద్భుతమైన టీజర్ కట్ ని వదిలి ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని సోషల్ మీడియా లో ఒక టాక్ నడుస్తుంది.
మరో టాక్ ఏమిటంటే రెండవ షెడ్యూల్ పూర్తి అయ్యాక మూవీ టీం మొత్తం విదేశాలకు వెళ్తుందని. విదేశాలకు వెళ్లే ముందు రాజమౌళి మూవీ టీం మొత్తం తో కలిసి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేస్తాడని, ఆ ప్రెస్ మీట్ లో సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది, యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి అనేది వివరిస్తాడని, అదే రోజున ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా వదులుతాడని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం అనేది మాత్రం ప్రస్తుతానికి ఎవ్వరూ చెప్పలేరు. ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో విలన్స్ వీళ్ళిద్దరే అని ప్రచారం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా వీళ్ళు విలన్స్ కాదని, ఆఫ్రికన్ నీగ్రో మెయిన్ విలన్ అని అంటున్నారు.
Also Read : ‘కేసరి 2’ మొదటి వారం వసూళ్లు..వచ్చిన పాజిటివ్ టాక్ కి ఇంత తక్కువ వసూళ్లా!