https://oktelugu.com/

సంక్రాంతికి ‘అల్లుడు’ రాక ఫిక్స్.. అదరగొడతాడా ?

ఈ సంక్రాంతికి అదరగొట్టడానికి ‘అల్లుడు’ వస్తున్నాడు. ఇంతకీ, ఈ అల్లుడు ఎవరు అంటే, బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా, జనవరి 15న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జనం థియేటర్స్ కి వస్తారనే నమ్మకం పెరగడంతో మేకర్స్ కూడా బాగానే హడావుడి చేస్తున్నారు. తమ సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ‘అల్లుడు అదుర్స్’ను విడుదలకు సిద్ధం చేశారు. Also Read: […]

Written By:
  • admin
  • , Updated On : December 27, 2020 / 05:14 PM IST
    Follow us on


    ఈ సంక్రాంతికి అదరగొట్టడానికి ‘అల్లుడు’ వస్తున్నాడు. ఇంతకీ, ఈ అల్లుడు ఎవరు అంటే, బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా, జనవరి 15న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జనం థియేటర్స్ కి వస్తారనే నమ్మకం పెరగడంతో మేకర్స్ కూడా బాగానే హడావుడి చేస్తున్నారు. తమ సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ‘అల్లుడు అదుర్స్’ను విడుదలకు సిద్ధం చేశారు.

    Also Read: ‘మారుతి – రవితేజ’ సినిమాకి క్రేజీ టైటిల్ !

    ఇక ‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాలి, ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ సినిమా కూడా గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఉంటుందని తెలుస్తోంది. ‘కందిరీగ’లో మంచి ఫన్ ఉన్నట్టే.. ఈ అల్లుడు అదుర్స్ లో కూడా డీసెంట్ ఫన్ ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

    Also Read: నాగార్జునపై మండిపడ్డ కామ్రేడ్‌

    అన్నట్టు ఈ సినిమాలో సోనూ సూద్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు, మొదట విలన్ గా నటించడానికి ఒప్పుకున్న సోనూసూద్.. ఆ తరువాత తనకు వచ్చిన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, సినిమాలో తన పాత్రను పెంచమని కోరినట్లు తెలుస్తోంది. ఇక ఫైట్స్ సంగతి సరేసరి. అన్నీ హైఓల్టేజ్ పోరాటాలే అట. రామ్, లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్న ఈ ఫైట్స్ కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టారు. ఏది ఏమైనా కమర్షియల్ హిట్ అందుకోవాలని బెల్లంకొండ హీరో సంక్రాంతికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్