
వ్యవసాయం అంటే తెలియని వారు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. కనీస మద్దతు ధర, వ్యవసాయ మార్కెట్లు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయని, వాటికి ఎలాంటి ఢోకా లేదని పునరుద్ఘాటించారు. హిమాచల్‌లోని బీజేపీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన వర్చువల్‌గా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హిమాచల్ ప్రదేశ్‌కు కేవలం 22,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని విమర్శించారు.