https://oktelugu.com/

‘అల్లు’ స్టూడియో.. చాలా కాస్టీ గురూ..!

మెగాస్టార్ చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు. అల్లు అరవింద్ టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లోనూ సినిమాలు నిర్మించి బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు అరవింద్ బడా నిర్మాతగా మారడానికి చిరంజీవి సినిమాలే కారణమని చెప్పక తప్పదు. అల్లు అరవింద్-చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. Also Read: ‘డార్లింగ్’ వెంటపడుతున్న ‘మన్మథుడు’..! అల్లు అరవింద్ నిర్మించే సినిమాల్లో మెగాస్టార్ నటించేందుకు అప్పట్లో తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో ఆయన […]

Written By: , Updated On : October 5, 2020 / 03:49 PM IST
Follow us on

మెగాస్టార్ చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు. అల్లు అరవింద్ టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లోనూ సినిమాలు నిర్మించి బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు అరవింద్ బడా నిర్మాతగా మారడానికి చిరంజీవి సినిమాలే కారణమని చెప్పక తప్పదు. అల్లు అరవింద్-చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి.

Also Read: ‘డార్లింగ్’ వెంటపడుతున్న ‘మన్మథుడు’..!

అల్లు అరవింద్ నిర్మించే సినిమాల్లో మెగాస్టార్ నటించేందుకు అప్పట్లో తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో ఆయన టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. అయితే చిరంజీవికి ఎప్పటి నుంచో స్టూడియో నిర్మించాలనే ఆలోచన ఉండేది. వైజాగులో చిరంజీవి స్టూడియో నిర్మిస్తారనే ప్రచారం జరిగినా.. అది ఎందుకో కార్యరూపం దాల్చడం లేదు.

చిరంజీవి స్టూడియో నిర్మాణం ఆలోచనలకే పరిమితం కాగా అల్లు అరవింద్ మాత్రం స్టూడియో నిర్మాణ పనులు మొదలుపెట్టేశాడు. అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య 99వ జయంతిని పురస్కరించుకొని అల్లు స్టూడియో నిర్మించనున్నట్లు ప్రకటించాడు. గండిపేటలోని ఏడెకరాల స్థలంలో 100కోట్లతో భారీ స్టూడియో ‘అల్లు ఫ్యామిలీ’ నిర్మించనుంది.

ఈ స్టూడియో కోసం అల్లు అరవింద్ తన ముగ్గురు కుమారులతో కలిసి 100కోట్ల పెట్టుబడి పెడుతున్నారట. ఈ స్టూడియోలో అల్లువారి సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులతోపాటు చిన్న సినిమాలు.. టీవీ షూటింగ్స్.. డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహాకు సంబంధించిన వెబ్ సీరిసు పనులు ఇక్కడే జరుగనున్నాయి.

Also Read: అమెరికాలో ఏకధాటిగా ‘పాట’పాడనున్న మహేష్..!

రాబడిపై లెక్క వేసుకున్నాక అల్లు అరవింద్ కుమారులు స్టూడియో వ్యాపారంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి.. రాంచరణ్ చేయలేని పనులను అల్లు ఫ్యామిలీ చేసేస్తుండటం గమనార్హం. అల్లు స్టూడియోను చాలా కాస్లీగా అన్ని హంగులతో హైదరాబాద్లోనే భారీగా నిర్మించబోతున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో విన్పిస్తోంది.