https://oktelugu.com/

తిరుపతిలో పోటీకి భయపడుతున్న పార్టీలు

ఏంటో కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి బాబు పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో.. ఏం చేస్తున్నాడో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రతిపక్షం సీటులో కూర్చున్న నాటి నుంచే మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తాను గెలుచుకున్న 23 మంది ఎమ్మెల్యేల్లో నుంచి పలువురిని వదులుకోవాల్సి వచ్చింది. చాలా వరకు కేడర్‌‌ అధికార పక్షమైన వైసీపీ పక్షాన చేరుతోంది. అయితే.. మొన్నటిదాకా జమిలి ఎన్నికలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2020 3:54 pm
    Follow us on

    ఏంటో కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి బాబు పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో.. ఏం చేస్తున్నాడో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రతిపక్షం సీటులో కూర్చున్న నాటి నుంచే మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తాను గెలుచుకున్న 23 మంది ఎమ్మెల్యేల్లో నుంచి పలువురిని వదులుకోవాల్సి వచ్చింది. చాలా వరకు కేడర్‌‌ అధికార పక్షమైన వైసీపీ పక్షాన చేరుతోంది. అయితే.. మొన్నటిదాకా జమిలి ఎన్నికలు వస్తాయంటూ సంబురపడి ప్రకటనలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక అంటే ఎందుకో భయపడుతున్నారట.

    ఈ ఎన్నికల నుంచి ఎలా తప్పించుకోవాలా అని బాబు సహా విపక్షాలంతా ఆలోచిస్తున్నాయట. ఈ ఎన్నికలలో పోటీ చేయాలని ఎవరికీ ఆసక్తి లేదట. ఎందుకంటారా.. ఏపీలో ఇప్పుడంతా వైసీపీ హవానే నడుస్తోంది. నిజానికి మొదట్లో చంద్రబాబుకు తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఉండేది. కానీ అక్కడ సీన్ చూస్తే రివర్స్‌లో ఉంది. మొత్తానికి మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు కూడా వైసీపీ ఎమ్మెల్యేల చేతిల్లోనే ఉన్నాయి. పైగా గత ఏడాది బల్లి దుర్గాప్రసాద్ అలా ఇలా గెలవలేదు, ఏకంగా రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. దాంతోపాటు ఈ ఏడాదిన్నరలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్ అమలు చేశారు. ఇక కరోనా కారణంగా దుర్గా ప్రసాద్ బలయ్యారు. ఆయన మంచివాడని సానుభూతి జనంలో ఉంది. ఇవన్నీ కలిసి వైసీపీకి ఎదురులేని పరిస్థితిని కల్పిస్తున్నాయి.

    ఇవన్నీ ఇలా ఉన్నా చంద్రబాబు జగన్‌కు ఊరికే ఎంపీ సీటు ఉదారంగా ఎందుకు ఇచ్చేయాలన్న ఆలోచనతో ఉన్నారని అంటున్నారు. కానీ ఆయన భయటపడరు, పోటీకి దిగరు, దిగితే సీన్ ఏంటో కచ్చితంగా తెలుసు. అందుకే బీజేపీని దువ్వుతున్నారని టాక్. బీజేపీ పోటీ చేస్తే వెనక నుంచి మద్దతు ఇస్తారట. బయటకు మాత్రం దుర్గాప్రసాద్ మీద సానుభూతితో పోటీ పెట్టడంలేదని కలరింగు ఇచ్చుకుంటారట. అంటే పగిలితే బీజేపీ ముక్కే పగలాలి. తాను మాత్రం సేఫ్ జోన్‌లో ఉండి జగన్‌కు ఉప ఎన్నిక తలనొప్పి కలిగించాలన్నది బాబు మార్క్ ప్లాన్ అంటున్నారు.

    సోము వీర్రాజు కూడా ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో మిత్రపక్షంగా మెదులుతున్న జనసేన, బాబుతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తిగా లేరట. పైగా టీడీపీ అతి తెలివి చూపించి బరి నుంచి తప్పుకుని బీజేపీని బలి పశువు చేయాలని పన్నుతున్న కుట్రను కమలం వాసులు గమనించారు. బాబు మద్దతు మనకెందుకన్న ఆలోచన కూడా ఉందట. ఇప్పుడు జగన్‌కు ఉన్న క్రేజీ, తిరుపతి సీటుపై ప్రజలకు ఉన్న సానుభూతితో అసలు పోటీ చేయకుండానే బాగుంటుందన్న ఆలోచన పార్టీల్లో కనిపిస్తోందట.