https://oktelugu.com/

ఇండియాలో కరోనా తగ్గుముఖం పట్టినట్లేనా..!

చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్‌.. ఇండియాకూ చేరుకుంది. ఒక్క కేసుతో మొదలై లక్షలకు చేరుకుంది. వేలాది మందిని బలితీసుకుంది. ఎన్నో కుటుంబాలను ఆగం చేసింది. మరెందరో ఉపాధిని దెబ్బతీసింది. అటు ప్రభుత్వాలూ ఆర్థిక నష్టాలను చూశాయి. కరోనా కారణంగా కేంద్రం కూడా లాక్‌డౌన్‌ ప్రకటించేసింది. అయితే.. మొన్నటి వరకు దేశంలో ఓ స్థాయిలో విజృంభించిన కరోనా.. ఇప్పుడు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. రికవరీ రేటు పెరుగుతుండడమే ఇందుకు కారణం. Also Read: ఆ ప్రాంతంలో వెనక్కు వెళ్లిన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2020 / 03:46 PM IST

    carona

    Follow us on

    చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్‌.. ఇండియాకూ చేరుకుంది. ఒక్క కేసుతో మొదలై లక్షలకు చేరుకుంది. వేలాది మందిని బలితీసుకుంది. ఎన్నో కుటుంబాలను ఆగం చేసింది. మరెందరో ఉపాధిని దెబ్బతీసింది. అటు ప్రభుత్వాలూ ఆర్థిక నష్టాలను చూశాయి. కరోనా కారణంగా కేంద్రం కూడా లాక్‌డౌన్‌ ప్రకటించేసింది. అయితే.. మొన్నటి వరకు దేశంలో ఓ స్థాయిలో విజృంభించిన కరోనా.. ఇప్పుడు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. రికవరీ రేటు పెరుగుతుండడమే ఇందుకు కారణం.

    Also Read: ఆ ప్రాంతంలో వెనక్కు వెళ్లిన సముద్రం.. సునామీకి సంకేతమా..?

    తాజాగా.. కేంద్ర ఆర్థిక శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. ఇండియాలో కోవిడ్‌ 19 పీక్‌ స్టేజ్‌ను దాటేసిందట. సెప్టెంబ‌ర్ నెల‌లో ఇండియాలో కోవిడ్-19 ప‌తాక స్థాయికి చేరింద‌ని, ఇక త‌గ్గుముఖం ప‌ట్టవ‌చ్చనే అంచ‌నాల‌ను వేసింది. ఎకాన‌మీ కూడా రిక‌వ‌రీ బాట ప‌ట్టింద‌ని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయ‌ప‌డింది.

    ప్రస్తుతం దేశంలో అన్‌లాక్‌ 5.0 నడుస్తోంది. అన్‌లాక్‌లో భాగంగా కేంద్రం ఒక్కో రంగానికి మినహాయింపు ఇస్తూ వస్తోంది. దేశంలో, రాష్ట్రాల్లో ఇప్పుడు జ‌న‌జీవ‌నం దాదాపు సాధార‌ణ స్థితికి వ‌చ్చింది. థియేట‌ర్లు, స్కూళ్లు, కాలేజీలు, ప్రజార‌వాణా, సాఫ్ట్ వేర్ ఆఫీసుల‌ను మిన‌హాయిస్తే మిగ‌తా వాటిల్లో 80 శాతం వ‌ర‌కూ య‌థా స్థితికి వ‌చ్చాయి. బ‌స్సు ప్రయాణాలు కూడా చేయ‌డానికి ప్రజ‌లు క్షేత్ర స్థాయిలో పెద్దగా భ‌య‌ప‌డ‌టం లేదు. ప్రధాన న‌గ‌రాల మ‌ధ్యన ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సులు సైతం న‌డుస్తున్నాయి.

    Also Read: మారిటోరియం చక్రవడ్డీ కేసు వాయిదా..

    ఈనెల 15 నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కోవిడ్‌ రూల్స్‌ పాటిస్తూ ఓపెన్‌ చేసుకోవచ్చని సూచించింది. ఒక్క సూళ్ల అంశాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. వీటన్నింటి నేపథ్యంలో తాజాగా.. కేంద్ర ఆర్థిక శాఖ ఓ ఆసక్తికర నివేదిక విడుదల చేసింది. సెప్టెంబ‌ర్ తొలి ప‌క్షంతో పోలిస్తే.. రెండో ప‌క్షం నుంచి రోజువారీగా కేసుల యావ‌రేజ్ త‌గ్గిందని పేర్కొంది. సెప్టెంబ‌ర్ ప్రథ‌మార్థంలో డైలీ యావ‌రేజ్ కేసుల సంఖ్య 93 వేల వ‌ర‌కూ ఉండ‌గా, ద్వితియార్థంలో 83 వేలకు తగ్గిందట. అలాగే.. రికవరీ రేటు పెరుగుతుండడం.. యాక్టివ్‌ కేసుల లోడ్‌ కూడా క్రమంగా తగ్గుతుండడం ఒక విధంగా గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి.