OTT : అల్లు శిరీష్ రెండేళ్ల తర్వాత ఇటీవల బడ్డీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం ఆగస్టు 2న ధియేటర్స్ లో రిలీజ్ అయింది. యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా వచ్చిన బడ్డీ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేసింది. తాజాగా ‘ బడ్డీ ‘ ఓటీటీ రిలీజ్ డేట్ నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. కోలీవుడ్ హీరో ఆర్య నటించిన ‘ టెడ్డీ ‘ మూవీ కి ఇది రీమేక్ గా వచ్చింది. శాంట్ అంటోన్ దర్శకత్వం వహించారు.
అల్లు శిరీష్ హీరోగా, గాయత్రి భరద్వాజ్, ప్రీషా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ ‘ బడ్డీ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వైవిధ్యమైన కథతో మంచి హిట్టు సొంతం చేసుకోవాలన్న అతని ప్రయత్నం ఫలించలేదు. నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఆగస్టు 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానుంది.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే .. ఆదిత్య ఒక పైలట్. పల్లవి కంట్రోల్ రూమ్ లో పని చేస్తూ ఉంటుంది. పైలట్ గా విధుల్లో ఉన్న సమయంలో ఆదిత్య తరచుగా కంట్రోల్ రూమ్ తో మాట్లాడుతూ ఉండాలి. ఆ సమయంలో పల్లవి పరిచయం అవుతుంది. ఒకరిని ఒకరు చూడకుండానే ఇష్టపడతారు. అయితే పల్లవి వల్ల ఆదిత్య ఉద్యోగం పోతుంది.
ఆదిత్యను కలిసి సారీ చెప్పాలి అని అనుకున్న సమయంలో పల్లవి ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. పల్లవిని కోమాలోకి వెళ్లేలా చేస్తారు. ఆ సమయంలో పల్లవి బతికుండగానే ఆమె ఆత్మ ఓ టెడ్డీబేర్ లోకి ప్రవేశిస్తుంది. అసలు పల్లవిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఆమె ఆత్మ టెడ్డి బేర్ లోకి ఎలా వెళ్ళింది? తిరిగి తన శరీరాన్ని పొందిందా లేదా? అనేది బడ్డీ కథ. మరి ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించగలదో లేదో చూడాలి.
ఇక అల్లు శిరీష్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. అన్నయ్య అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో దున్నేస్తున్నాడు. అల్లు శిరీష్ మాత్రం కనీసం టైర్ టు హీరో కాలేకపోతున్నాడు. అల్లు శిరీష్ గత చిత్రం ఊర్వశివో రాక్షసివో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా మాత్రం ఆడలేదు. ఈ మూవీ హీరోయిన్ అను ఇమ్మానియేల్ తో అల్లు శిరీష్ ఎఫైర్ నడిపాడనే పుకార్లు ఉన్నాయి. బడ్డీ మూవీ సైతం నిరాశపరిచిన నేపథ్యంలో నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడనే ఆసక్తి నెలకొంది.