https://oktelugu.com/

Telegram CEO Powell : టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ అరెస్ట్.. కారణమేంటంటే?

టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్‌ను ఫ్రెంచ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అసలు ఇంత సడెన్‌గా అతన్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? టెలిగ్రామ్ యాప్‌కి సంబంధించిన కేసులో అరెస్టు చేశారా? లేకపోతే ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 25, 2024 / 02:58 PM IST

    Pavel Durov arrested by French police

    Follow us on

    Telegram CEO Powell : ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ గురించి అందరికీ తెలిసిందే. దీనిని చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఇందులో ఇతరులతో చాట్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఒక్క మాటలో చెప్పాలంటే వాట్సాప్‌ తర్వాత దీనిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్‌ను ఫ్రెంచ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అసలు ఇంత సడెన్‌గా అతన్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? టెలిగ్రామ్ యాప్‌కి సంబంధించిన కేసులో అరెస్టు చేశారా? లేకపోతే ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ అజర్‌బైజాన్ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి ప్రైవేట్ జెట్‌లో వచ్చారు. లే బోర్గట్ విమానాశ్రయంలోనే అతన్ని ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. టెలిగ్రామ్ యాప్‌లో కంటెంట్ సరిగ్గా లేకపోవడం, దీనిద్వారా నేరాలు ఎక్కువగా జరగడం, పెరుగుతున్న సైబర్ నేరాలు, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లు, మోసం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటివి జరుగుతున్నాయని అతన్ని అరెస్టు చేశారు. గతంలోనే అతనిపై ఈ ఆరోపణలు రాగా అతనికి అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ఈక్రమంలోనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయాన్ని టెలిగ్రామ్ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు కూడా ప్రకటించలేదు. అయితే అతన్ని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి.

    ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి టెలిగ్రామ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ యుద్ధం సమయంలో సమాచారాన్ని అందించడానికి ఈ యాప్‌ను ఎక్కువగా వాడారని సమాచారం. ఇప్పటికీ ఆ దేశాలు ఎక్కువగా ఈ యాప్‌నే వాడుతున్నారట. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ యాప్ ద్వారానే సమాచారాన్ని తన అధికారులకు చేరవేసేవారని సమాచారం. అంతర్జాతీయంగా మనీలాండరింగ్, చీటింగ్, మాదక ద్రవ్యాలు, చిన్న పిల్లలపై లైంగిక దాడులు వంటి వాటిని నిరోధించడానికి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కనీసం టెలిగ్రామ్‌ యాప్‌ను కూడా అప్‌డేట్ చేయలేదు. ఇంకా ఇలానే వదిలేస్తే యాప్‌ ద్వారా ఎంత నష్టం అవుతుందో అని పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకు ముందే అరెస్ట వారెంటీ జారీ చేశారు. దీంతో అతను కొన్ని రోజుల నుంచి ఫ్రాన్స్ వెళ్లడం లేదు.

    ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోంది. దీనిని స్థాపించిన దురోవ్ రష్యాకు చెందినవాడు. కానీ కొన్ని కారణాల వల్ల రష్యాను వదిలి ఫ్రాన్స్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ $15.5 బిలియన్ల వరకు ఉంటుందని ఫోర్బ్స్ వివరాలు చెబుతున్నాయి. వికోంటాక్టె సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌కు పోటీగా ఈ టెలిగ్రామ్ యాప్‌ను తయారు చేశారు. దీన్ని నిలిపివేయాలని రష్యా ప్రభుత్వం డిమాండ్ చేయడంతో సొంత దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.