
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్టుగా ఉంది అల్లు శిరీష్ పరిస్థితి. కావాల్సినంత సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ విజయానికి ఆమడ దూరంలోనే ఉండి పోతున్నాడు. అ క్రమంలో నిదానమే ప్రధానం అన్నట్టుగా అల్లు శిరీష్ ఒక్కో సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు. 2013 లో హీరో గా కెరీర్ ప్రారంభించి నప్పటి నుంచి ఇప్పటివరకు అయిదు తెలుగు సినిమాలు ,ఒక మళయాళం సినిమా మాత్రమే చేయడం జరిగింది. 2019 మే 17 న విడుదల అయిన ` A B C D `చిత్రం తరవాత అల్లు శిరీష్ తదుపరి సినిమా ఏమిటనేది ఇంతవరకు ప్రకటించ లేదు.
ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాకేశ్ శశితో ఒక సినిమా చేయడానికి అల్లు శిరీష్ అంగీకరించాడని తెలుస్తోంది గతంలో మెగా స్టార్ చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ సినిమా చేసిన రాకేష్ శశి, ఇటీవలే అల్లు శిరీష్ కి ఒక కథను వినిపించి ఓకే కున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితం కానుందట. ఆ క్రమంలో కరోనా పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్ కి వెళ్తారని తెలుస్తోంది .