Allu Aravind- Mahesh Babu: సర్కారు వారి పాట సక్సెస్ మీట్ కర్నూల్ నగరంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మమమ… మహేష్ సాంగ్ స్టేజ్ పై డాన్సర్స్ పర్ఫార్మ్ చేస్తుండగా, మహేష్ వేదికపైకి వెళ్లి వాళ్ళతో పాటు డాన్స్ చేశాడు. అసలు ఎవరూ పిలవకుండానే, ఆ పాట ప్రేరేపించినట్లుగా మహేష్ డాన్స్ చేయడం జరిగింది. దీని గురించి మీడియాలో ప్రముఖంగా కథనాలు వెలువడ్డాయి. ఒకప్పుడు మహేష్ పబ్లిక్ లోకి వచ్చేవారు కాదు. ఆయన చాలా రిజర్వుడ్ గా ఉండేవారు. అలాంటి మహేష్ తన మూవీ ప్రమోషన్ కోసం పబ్లిక్ వేదికపై డాన్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఓ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో హీరో, హీరోయిన్స్ పాత్ర ఎంత కీలకమో వివరిస్తూ… నిర్మాత అల్లు అరవింద్ మహేష్ చేసిన డాన్స్ గురించి పరోక్షంగా మాట్లాడారు. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్, సినిమాను ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత హీరోలదే అన్నారు. హీరో, హీరోయిన్ సినిమా ప్రమోషన్స్ లో తప్పకుండా పాల్గొనాలి. ఓటీటీల కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడమే మానేశారు. పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. కాబట్టి హీరోలు ప్రమోషన్స్ లో సీరియస్ గా పాల్గొనాలి. ఈ మధ్య ఓ పెద్ద హీరో స్టేజ్ పై డాన్స్ చేసి తన సినిమా ప్రమోట్ చేసుకున్నారని, మహేష్ ని ఉద్దేశిస్తూ మాట్లాడారు.
Also Read: Raghunandan Rao: బాలికపై గ్యాంగ్ రేప్ కేసు: సంచలన వీడియో బయటపెట్టిన రఘునందన్ రావు
మూవీ థియేటర్స్ లో విడుదలైన రెండు మూడు వారాలకే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. చిరంజీవి ఆచార్య, మహేష్ సర్కారు వారి పాట మూడు వారాలు ముగియగానే ఓటీటీలో ప్రసారమయ్యాయి. సర్కారు వారి పాట ఇంకా థియేటర్స్ లోనే ఉంది, ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. దీంతో ప్రేక్షకులు కొద్దిరోజులు ఆగి ఓటీటీలో చూడొచ్చులే అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇది చిత్రాల వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రమోషన్స్ లో హీరోలు పాల్గొని హైప్ పెంచి ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చేలా చేయాలనేది అల్లు అరవింద్ భావన .
Also Read:Major- Vikram Movie: మూవీ లవర్స్ కి బెస్ట్ వీకెండ్… థియేటర్స్ లో రెండు అద్భుత చిత్రాలు!