Anchor Rashmi marriage: బుల్లితెర పై జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఎంత మంది పాపులర్ కమెడియన్స్ మరియు యాంకర్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ బ్లాక్ బస్టర్ కామెడీ షో చక్కటి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు వెళ్తూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ షోలో ఎంతో మంది కమెడియన్స్ మారిపోయారు, జడ్జీలు మారిపోయారు, కానీ ఒక్క యాంకర్ మాత్రం మారిపోలేదు. రష్మీ(Rashmi Gautam) గత 12 ఏళ్ళ నుండి విరామం లేకుండా ఈ షోకి యాంకర్ గా కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఈమెతో పాటు ఇదే షో ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా అనసూయ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందింది. ఈమె కూడా రెండేళ్ల క్రితమే ఈ షో కి గుడ్ బై చెప్పింది.
ఇక రష్మీ విషయానికి వస్తే, ఈమె కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వాటిల్లో ‘గుంటూరు టాకీస్’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, అసలు వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఈటీవీ లోనే జబర్దస్త్, మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ముందుకెళ్తోంది యాంకర్ రష్మీ. ఇదంతా పక్కన పెడితే బుల్లితెర పై రష్మీ, సుధీర్ జోడి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూసే ఎవరికైనా సరే వీళ్ళ జంట కేవలం ఆన్ స్క్రీన్ కి మాత్రమే పరిమితం అంటే అసలు నమ్మరు. కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో జరుగుతోంది అని అనిపిస్తాది. కానీ వీళ్ళు మాత్రం మేము కేవలం స్నేహితులం మాత్రమే, కనీసం మేము ఫోన్ లో కూడా మాట్లాడుకోము అంటూ చెప్పుకొచ్చేవారు.
అయితే లేటెస్ట్ గా విడుదల చేసిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోమోలో ఆమె తన పెళ్లి గురించి దాదాపుగా అధికారిక ప్రకటన చేసినట్టే అనిపించింది. వివరాల్లోకి వెళ్తే ఈ ప్రోమోలో ఒక జ్యోతిష్యుడు రష్మీ జాతకం చూస్తూ, ఈమె వచ్చే ఏడాది ఆగష్టు నెలలో పెళ్లి చేసుకుంటుందని చెప్తాడు. ఆ వివాహం కూడా తన మనసులో ఉన్న వ్యక్తినే చేసుకుంటుందని అంటాడు. జ్యోతిష్యుడు వ్యాఖ్యలపై స్పందించిన రష్మీ, ఆయన చెప్పినది నిజమే అని అంటుంది. రష్మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరు అంటే, చిన్నపిల్లవాడిని అడిగిన చెప్తారు, అది సుడిగాలి సుధీర్ అని, కాబట్టి ఈమె సుధీర్ నే పెళ్లి చేసుకోబోతుందా?, త్వరలోనే ఈ విషయం పై వీళ్లిద్దరు అధికారిక ప్రకటన చేయబోతున్నారా అనేది చూడాలి. యూట్యూబ్ లో బాగా వైరల్ అయిన ఈ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.
