Akhanda 2 Movie 5 Days Collections: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) స్పీడ్ కి ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా నిల్చింది. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమా ఫ్లాప్ అవ్వడం అసాధ్యం అని ట్రేడ్ లో ఒక బలమైన నమ్మకం ఉండేది. ఆ నమ్మకం ఈ సినిమాతో పోయింది అనే చెప్పాలి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే మొదటి రోజు నూన్ షోస్, మ్యాట్నీ షోస్ కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. కానీ గత నాలుగు చిత్రాల ద్వారా బాలయ్య జనాల్లో సంపాదించిన నమ్మకం కారణంగా, ఈ చిత్రానికి వీకెండ్ వరకు డీసెంట్ స్థాయి వసూళ్లను అందించారు ఆడియన్స్. అలా 5 రోజులు పూర్తి చేసుకొని ఆరవ రోజులోకి అడుగుపెట్టింది ఈ చిత్రం.
అయితే ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 5 రోజుల్లో వచ్చిన వసూళ్ళని చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అని మరోసారి స్పష్టంగా తెలుస్తోంది. 5 వ రోజున ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి 73 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 2 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా 5 రోజుల్లో వచ్చిన వసూళ్లను చూస్తే నైజాం ప్రాంతం నుండి 15 కోట్ల 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, సీడెడ్ ప్రాంతం నుండి 10 కోట్ల 22 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 4 కోట్ల 64 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా నుండి 3 కోట్ల 67 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 2 కోట్ల 68 లక్షలు వచ్చాయి.
అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 4 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, కృష్ణ జిల్లా నుండి 3 కోట్ల 20 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 2 కోట్ల 39 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 47 కోట్ల 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ దాదాపుగా 76 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా లో కర్ణాటక నుండి 5 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఓవర్సీస్ నుండి 4 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 57 కోట్ల 29 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 96 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు లేదా రేపటి లోపు ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఈ చిత్రం ఇంకా 46 కోట్ల 71 లక్షల రూపాయిలు రాబట్టాలి.