spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP SSC Result 2022 Postponed: చివరి నిమిషంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా.....

AP SSC Result 2022 Postponed: చివరి నిమిషంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా.. అసలేం జరిగింది?

AP SSC Result 2022 Postponed: ఏపీలో విద్యాశాఖ మంత్రి బొత్సకు, అధికారుల మధ్య సమన్వయలోపంతో ఏకంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు వాయిదాపడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్‌ దేవానంద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తుండగా సడన్‌గా వాయిదా పడినట్టు అధికారులు ప్రకటించారు.దీంతో అటు విద్యార్థులు.. ఇటు పేరెంట్స్ అందరూ తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. అలాంటప్పుడు ముందుగా ఎందుకు ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు. శాఖలపరంగా మంత్రులకు పట్టు లేకపోవడమే ఇటువంటి ఘటనలకు కారణమని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణం ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. సోమవారం ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

AP SSC Result 2022 Postponed
AP SSC Result 2022 Postponed

జరిగిందిదీ..
పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడడానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమని తెలుస్తోంది. మంత్రి బొత్సకు సమాచారం ఇవ్వకుండా అధికారులే ఫలితాల ప్రకటన చేసినట్లుగా సమాచారం. దీంతో అధికారులు తీరుపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Amravati: అమరావతి ఉద్యమానికి 900 రోజులు..అలుపెరగని పోరాటం చేసిన రైతులు

దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు ఫలితాల వెల్లడిని వాయిదా వేశారు. అయితే అధికారుల తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని ఫలితాలను వాయిదా వేయడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంగా మేథావులు, విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలా అంటూ ప్రశ్నిస్తున్నారు.. ఉన్నట్టుండి ఫలితాలను వాయిదా వేయడంపై సర్వత్రా గందరగోళం నెలకొంది.

AP SSC Result 2022 Postponed
AP SSC Result 2022 Postponed

విద్యార్థి సంఘాల ఆందోళన
పదో తరగతి పరీక్షా ఫలితాల వాయిదాపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా ప్రణాళిక ప్రకారం విడుదల చేయలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. మంత్రి, అధికారుల మధ్య సమన్వయం లేదని ఫలితాలు వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నించారు. ర్యాంకులు ప్రకటిస్తే.. జరిమానా అని‌ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇప్పుడు అర్ధంతరంగా ఫలితాలు వాయిదా వేశారని తెలిపారు. మరి అధికారులు, ప్రభుత్వానికి ఎటువంటి జరిమానా వేయాలని నిలదీశారు. ఆరు లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారా… దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

Also Read:Raghunandan Rao: బాలికపై గ్యాంగ్ రేప్ కేసు: సంచలన వీడియో బయటపెట్టిన రఘునందన్ రావు
Recommended Videos
ఇద్దరు కౌలు రైతుల ఆవేదన || Nagababu Satires on CM Jagan and Chandrababu || Janasena
పడి పడి నవ్వుకున్న పవన్ || Nagababu Hilarious Comments on Avanthi Srinivas || Janasena Party
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతా.. || Pawan Kalyan Comments on YSR Rythu Bharosa || Ok Telugu

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version