Allu Arjun shock to Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అభిమానుల్లో కలగడం లేదు. కారణం సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే. దానికి తోడు సినిమాకు కూడా ఆశించినంత హైప్ జనరేట్ అవ్వడం లేదు. అందుకు ఒక ఉదాహరణ తీసుకుందాం. నెల్లూరు వంటి టాప్ సిటీ లో సాధారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ ని ఆన్లైన్ లో వదలరు. బయటే ఫ్యాన్స్ మొత్తం కొనుగోలు చేసి తమ వద్ద పెట్టుకొని అమ్ముకుంటారు. ఒకవేళ అమ్ముడుకాకపోతే మొత్తం థియేటర్స్ లో వదిలేస్తారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఇప్పుడు అదే జరిగింది. నెల్లూరు లోని అన్ని థియేటర్స్ లో టికెట్స్ ని ఆన్లైన్ కి వదిలేశారు. దీనిని బట్టీ చూస్తే సినిమాకు అసలు డిమాండ్ లేనట్టే.
అసలే డిమాండ్ లేదని అభిమానులు బాధపడుతుంటే, పుండు మీద కారం చల్లినట్టు మూవీ టీం కూడా ప్లానింగ్ విషయం లో అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. నిన్న మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఏషియన్ చైన్ మధ్య చిన్న పాటి వాగ్వాదం జరిగిందట. ప్రీమియర్ షోస్ నుండి వచ్చే గ్రాస్ లో వాటాలు కోసం కొట్టుకున్నారు. ఫలితంగా ఏషియన్ చైన్ అడ్వాన్స్ బుకింగ్స్ ని నిన్న ప్రారంభించలేదు. దిల్ రాజు థియేటర్స్ కూడా హోల్డ్ లో పడ్డాయి. దీంతో అప్పటికే 12 కోట్ల రూపాయిలను దాటాల్సిన హైదరాబాద్ గ్రాస్, కేవలం 5 కోట్ల రూపాయిల గ్రాస్ వద్దనే ఆగిపోయింది. కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈరోజు మధ్యాహ్నం నుండి నైజాం ప్రాంతం వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రీమియర్ షోస్ కి ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది.
Also Read: ‘హరిహర వీరమల్లు’ యుఎస్ఏ రివ్యూ… హిట్టా? ఫట్టా?
దీంతో అభిమానులు కాస్త శాంతించారు, కానీ 12 గంటల్లో రికార్డు స్థాయి బుకింగ్స్ జరుగుతుందా లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ మీద బలమైన నమ్మకాన్ని ఉంచి హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతుందో చూడాలి మరి. కచ్చితంగా ప్రీమియర్ షోస్ నుండి ఈ సినిమాకు టాక్ రావాల్సిందే. లేకపోతే రేపు రెగ్యులర్ షోస్ మీద చాలా బలమైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద సిటీస్ లో కూడా హౌస్ ఫుల్ షోస్ ని చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. మూవీ టీం మాత్రం ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది, కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేస్తుంది అనే నమ్మకం తో ఉన్నారు. ఆ నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.
ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి ఒక తమాషా జరిగింది. హైదరాబాద్ లో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కి సంబంధించి AAA సినిమాస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ అందరి అగ్ర హీరోల సినిమాలు ప్రదర్శితం అవుతాయి. కానీ రాత్రి హరి హరి హర వీరమల్లు చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టినట్టే పెట్టి మధ్యలో ఆపేసారు. అలా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా మూడు సార్లు జరిగింది. దీంతో అల్లు అర్జున్ హరి హర వీరమల్లు సినిమాని తన థియేటర్ లో ప్రదర్శించడానికి ఇష్టం చూపడం లేదని, పవన్ కళ్యాణ్ కి ఊహించని షాక్ ఇచ్చాడని, ఇక కోలుకోవడం కష్టమే అంటూ నెటిజెన్స్ చెప్పుకొచ్చారు. కానీ అర్థరాత్రి నుండి పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు.