Hari Hara Veeramallu USA Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ అంతకు ముందు కమిట్ అయిన సినిమాలన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా రేపు ఇండియాలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు యూఎస్ఏ లో ప్రీమియర్ షోస్ అయితే వేశారు. మరి ప్రీమియర్స్ ను బట్టి ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ఈ సినిమా కథ విషయానికి వస్తే కోహినూరు డైమండ్ నుంచి స్టార్ట్ అవుతోంది. భాగ్యనగరం లోని నిజం రాజులు దాన్ని దక్కించుకోవడానికి ఏం చేశారు. ఆ రాజులు దానికోసం ప్రయత్నిస్తున్న సమయం లో అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులను పడ్డారు. ఇది తెలుసుకున్న వీరమల్లు ప్రజల వైపు ఎలా నిలబడ్డాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
Also Read: ’హరి హర వీరమల్లు’ పై జాలి చూపిస్తున్న వైసీపీ నేతలు..అయ్యో పాపం!
ఇక విశ్లేషణ విషయాని వస్తే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్ గా అయితే లేదట. మధ్య మధ్యలో అనవసరమైన సీన్స్ రావడం తో బోరింగ్ కూడా అనిపించిందట.అయితే కంటెంట్ బాగున్నప్పటికి దర్శకుడు జ్యోతికృష్ణ కి స్టార్ జు హ్యాండిల్ చేయడం రాలేదు. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా వీక్ గా ఉన్నాయి. దర్శకుడు ఎఫెక్ట్ గా ఈ సినిమాని మలచలేకపోయాడు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ప్రీమియర్ షోస్ రద్దు?
విజువల్స్ కూడా అంత హై రేంజ్ లో ఏమీలేవు, గ్రాఫిక్స్ వర్క్ కూడా అనుకున్న స్థాయిలో లేదు… ఇవన్నీ ఈ సినిమాకు భారీగా మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి… సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ చేసే ఫైట్ సీక్వెన్సెస్ కొంచెం ఓవర్గా ఉన్నాయి… క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెస్సివ్ గా అనిపించలేదని యుఎస్ ఏ ప్రేక్షకుల నుంచి వార్తలైతే వస్తున్నాయి.
ఇక కీరవాణి మ్యూజిక్ కొంత వరకు పర్లేదు అనిపించినప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది…ఇక పవన్ కళ్యాణ్ లుక్ గుడ్ అనిపించయట… బాబీ డియోల్ గారి యాక్టింగ్ కూడా ఇంప్రెసివ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది…