England Vs India Test Match: ఆట అన్నాక గెలుపు సహజం. ఓటమి కూడా సహజం. ప్రఖ్యాతమైన లార్డ్స్ మైదానంలో ఇటీవల భారత జట్టు గెలుపు ముందు బోల్తా పడింది. అలాగని ప్రత్యర్థి ముందు చేతులెత్తేయ లేదు. చివరి వరకు టెన్షన్ పెట్టింది. ఒకరకంగా ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించింది. ఇటీవల కాలంలో ఈ తరహాలో ఒక టెస్ట్ మ్యాచ్ జరగలేదని దిగ్గజ ఆటగాళ్లు వ్యాఖ్యానించాలంటే భారత ఆటగాళ్ల ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: వెస్టిండీస్ తుక్కు రేగొడుతున్న ఆస్ట్రేలియన్లు
లార్డ్స్ లో గెలిచిన తర్వాత సహజంగానే ఇంగ్లీష్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాకపోతే ఆత్మవిశ్వాసం స్థానంలో పొగరు వస్తేనే ఇబ్బంది. ఇంగ్లీష్ జట్టులో ఉన్న ఆటగాళ్లలో బ్రూక్ కు తల పొగరు బాగా పెరిగిపోయింది.. ఎందుకంటే అతను చేసిన వ్యాఖ్యలు ఆ తరహాలో ఉన్నాయి మరి. దూకుడుగా ఆడే లక్షణమున్న బ్రూక్.. నాలుగో టెస్ట్ ప్రారంభం కి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడాడు..” పర్యాటక జట్టు మమ్మల్ని చూసి భయపడుతోంది” అని వ్యాఖ్యానించాడు..” మైదానంలో మేము పిల్లల మాదిరిగా ప్రవర్తించలేం. క్రికెట్ గౌరవాన్ని కాపాడుతాం. కానీ పర్యాటక జట్టు ప్లేయర్లు మా ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. దాడి కూడా చేశారు.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి మేము మొత్తం పరిశీలిస్తూనే ఉన్నాం.. ఆ తర్వాత మా గేమ్ ప్లాన్ మొదలుపెట్టాం. భారత్ ఒత్తిడి ఎదుర్కొంది. చివరికి విజయ మా సొంతమైందని” బ్రూక్ పేర్కొన్నాడు.
వాస్తవానికి ఇంగ్లాండ్ ఆటగాళ్ల మీదికి భారత ప్లేయర్లు దూసుకుపోలేదు. కనీసం వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంగ్లాండ్ ప్లేయర్లే భారత ఆటగాళ్లను రెచ్చగొట్టారు. “ఇదేం బ్యాటింగ్.. ఇదే స్థాయిలో పరుగులు చేయగలరా.. ఈ మాత్రం దానికి ఇక్కడ దాకా వచ్చారా.. నిలబడి ఆడగలరా.. మీకు సాధ్యమవుతుందా.. మీరు మా బంతులను ఎదుర్కోగలరా.. గాయాలు అవుతుంటాయి.. నిలబడాలి కదా.. నిలబడే దమ్ము మీలో ఉందా” ఇలా టీమిండియా ప్లేయర్లను రెచ్చగొట్టే విధంగా ఇంగ్లీష్ ఆటగాళ్లు వ్యాఖ్యలు చేశారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అందువల్లే టీమ్ ఇండియా ప్లేయర్లు రివర్స్ ఎటాక్ మొదలుపెట్టేసరికి విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారని ఇంగ్లీష్ ఆటగాళ్ల మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: సర్ఫరాజ్ ఖాన్ 17 కిలోల బరువు తగ్గడం వెనక అసలు కారణం ఇది!
బ్రూక్ వ్యాఖ్యలు టీమిండియా అభిమానులలో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. బ్రూక్ అలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అభిమానులు మండిపడుతున్నారు. ఇంగ్లీష్ ఆటగాళ్లు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వల్లే.. భారత ప్లేయర్లు ధైర్యంగా స్పందించారని.. ఆస్పందనను ఇంగ్లీష్ ఆటగాళ్లు ఊహించి ఉండరని.. అందువల్లే ఇలాంటి పలాయన వాదాన్ని ఎంచుకున్నారని ఇండియన్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. భారత జట్టును ఉద్దేశించి భయపడుతోందని వ్యాఖ్యలు చేసిన బ్రూక్ తగిన మూల్యం చెల్లించుకుంటాడని.. కచ్చితంగా అతడికి భయం అంటే ఏంటో పరిచయం చేయాలని టీమ్ ఇండియా ప్లేయర్లకు అభిమానులు సూచిస్తున్నారు.. బ్రూక్ దూకుడు తనాన్ని నాలుగో టెస్టులో తగ్గించి చూపించాలని.. అప్పుడే అతడికి టీమిండియా అంటే ఏంటో తెలుస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు.