Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా విజయంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీ గా ఉన్నప్పటికీ తనకు బాగా దగ్గరైన వారికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. తాజాగా బన్నీ నల్గొండ లో ఒక కార్యక్రమం కోసం హాజరై సందడి చేశాడు.
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తాజాగా నల్గొండలోని పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామంలో ఓ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కంచర్ల కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి అల్లుడు బన్నీని పిలిచారు. మామ కోసం అల్లు అర్జున్ కన్వెన్షన్ సెంటర్ ఓపెనింగ్ కి వచ్చాడు. ఈ సందర్భంగా నల్గొండ లో బన్నీకి అద్భుతమైన స్వాగతం లభించింది. అల్లు అర్జున్ ని చూడడానికి చుట్టుపక్కల నుంచి కూడా భారీగా అభిమానులు వచ్చారు. బన్నీకి భారీ బ్యానర్స్ తో వెల్కమ్ చెప్పారు. గజమాలతో అల్లు అర్జున్ కి స్వాగతం పలికారు అభిమానులు.
ఇంత వరకు బాగానే ఉంది కానీ, కంచర్ల కన్వెన్షన్ ఓపెనింగ్ అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే అనేక సందేహాలు వస్తున్నాయి. సాదారణంగా హీరోలు కావచ్చు ఎవరైనా ఇలాంటి ఓపెనింగ్స్ కి వెళితే కార్యక్రమం తర్వాత ఫోటోలు, అభివాదాలు తప్ప ఎక్కడ కూడా బహిరంగ సభలు పెట్టరు. కానీ ఇక్కడ బన్నీ ఏకంగా భారీ బహిరంగ సభలో పాల్గొనటం విశేషం. అయితే దీని వెనుక పెద్ద కథే నడుస్తున్నట్లు తెలుస్తోంది.
బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి నల్గొండ లో BRS పార్టీ తరపున కీలక నేతగా ఎదుగుతున్నాడు. అన్ని కుదిరితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అందులో భాగంగానే ఇలాంటి బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. పనిలో పని అటు షాప్ ఓపెనింగ్ ఇటు రాజకీయంగా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మద్దతు దక్కవచ్చు. పైగా నల్గొండ లో BRS కు సరైన మద్దతు లేదు. గట్టి నాయకుల కోసం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో దాదాపు 80 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు బన్నీ తో తన బలం ఏమిటో చూపించే ప్రయత్నంలో భాగంగా అల్లు అర్జున్ మామ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
https://twitter.com/vamshipatel06/status/1692811331647549664