IND W Vs WI W: ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ హెలి మాథ్యూస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నాలుగు వికెట్లు నష్టానికి 195 పరుగులు చేసింది. స్మృతి మందాన (54), ఉమా చేత్రి(24), జెమీమా(73), రీచా ఘోష్(20), హర్మన్ ప్రీత్ కౌర్(13*), సజీవన్ సంజన(1*) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో కరిష్మా రెండు వికెట్లు పడగొట్టి. డాటిన్ ఒక వికెట్ తీసింది. అనంతరం 196 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన వెస్టిండీస్ 7 వికెట్లు నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా 49 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది.
వెస్టిండీస్ జట్టులో డాటిన్(52), కియానా జోసెఫ్ (49) టాప్ స్కోరర్లుగా నిలిచారు.. మిగతా ప్లేయర్లంతా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. భారత బౌలర్లలో టిటాన్ సాధు మూడు వికెట్లు పడగొట్టింది. రాధా యాదవ్, దీప్తి శర్మ చెరి 2 వికెట్లు సాధించారు. మిగతా ప్లేయర్లు విఫలం కావడం.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వెస్టిండీస్ జట్టు ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునే దిశగా కనిపించలేదు. డాటిన్ మెరుగ బ్యాటింగ్ చేసినప్పటికీ.. అది వెస్టిండీస్ జట్టుకు ఉపయోగపడలేదు. కెప్టెన్ హెలి మాథ్యూస్ అనవసరమైన షాట్ కోసం యట్నుంచి మిన్ను మణి పట్టిన అద్భుతమైన క్యాచ్ తో వెను తిరిగింది. ఇక అప్పుడు మొదలైన వెస్టిండీస్ జట్టు వికెట్ల పతనం చివరి వరకు కొనసాగింది. భారత బౌలర్లు మధ్యలో కాస్త చేతులెత్తేసినా.. మళ్లీ పుంజుకున్నారు. ఫలితంగా వెస్టిండీస్ జట్టు పై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. 73 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకుంది. కాగా, ఈ సిరీస్లో రెండవ మ్యాచ్ డిసెంబర్ 17 న ముంబైలో జరగనుంది.
స్మృతి మందాన రికార్డ్
ఈ మ్యాచ్లో 54 పరుగులు చేయడం ద్వారా.. ఈ ఏడాది టీ20లలో 6 పరుగులు చేసిన ప్లేయర్ గా స్మృతి నిలిచింది. అంతేకాదు ఈ ఏడాది టీ20లలో అత్యధికంగా పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో ఆమె నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆమె సాధించిన 54 పరుగులలో 7 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.. ఇక ఈ స్కోర్ ద్వారా జట్టు పై భారత జట్టు మరో రికార్డ్ సాధించింది. ఈ జట్టుపై హైయెస్ట్ స్కోర్ ను నమోదు చేసింది. 2019లో గ్రాస్ హైలెట్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఇప్పుడు దానిని మరో 9 పరుగులకు పెంచి 195 రన్స్ కు చేర్చుకుంది. మొత్తంగా వెస్టిండీస్ జట్టుపై హైయెస్ట్ స్కోర్ ను నమోదు చేసింది.