Allu Arjun: పుష్ప 2 ముందు వరకు అల్లు అర్జున్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. కేరళలో కూడా ఆయనకు అభిమానులు ఉండేవారు. నార్త్ లో అల్లు అర్జున్ కి మార్కెట్ లేదు. టాలీవుడ్ నుండి ఒక్క ప్రభాస్ మాత్రమే హిందీలో సత్తా చాటాడు. ప్రభాస్ అనంతరం పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్. దర్శకుడు సుకుమార్ పుష్ప చిత్రాన్ని కేవలం తెలుగులోనే విడుదల చేయాలని అనుకున్నారు. రాజమౌళి సలహాతో రెండు భాగాలుగా కథ చెప్పాలని అనుకున్నాడు. ఈ క్రమంలో పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల చేయాలని ప్రణాళికలు వేశారు.
2021లో పుష్ప తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. హిందీలో ఫస్ట్ డే చాలా పూర్ రెస్పాన్స్ వచ్చింది. సరిగా ప్రమోషన్స్ నిర్వహించకపోవడం దీనికి కారణమైంది. పుష్ప ఫస్ట్ డే కేవలం రూ. 3 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. అయితే మౌత్ టాక్ తో పుంజుకున్న పుష్ప ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్ నార్త్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా బీహార్, యూపీ, ఒరిస్సా,ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. పుష్ప విడుదలైన మూడేళ్లకు పుష్ప 2 విడుదల చేశారు. అయినా మూవీపై ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.
వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన పుష్ప 2 ఏళ్లుగా పదిలంగా ఉన్న బాహుబలి 2 రికార్డు లేపేసింది. ఒక్క హిందిలోనే ఈ చిత్రం రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2000 కోట్ల వసూళ్లతో దంగల్ మాత్రమే పుష్ప కంటే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. ఈ రికార్డుని పుష్ప 2 బ్రేక్ చేయడం ఖాయం. దేశంలోనే అల్లు అర్జున్ అతిపెద్ద స్టార్ గా ఎదిగాడు.
కాగా అల్లు అర్జున్ బాలీవుడ్ లెజెండరీ దర్శకుడిగా సినిమా ప్లాన్ చేస్తున్నాడట. సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ మూవీ ఖరారు అయ్యిందనేది లేటెస్ట్ టాక్. సిల్వర్ స్క్రీన్ పై కళాఖండాలు ఆవిష్కరించిన సంజయ్ లీలా భన్సాలీతో చిత్రం అంటే అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇతర టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్ ని చేరుకోవడం కష్టమే అన్నవాదన మొదలైంది.