Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan) సీరియస్ అయ్యారు. కోపంతో ఊగిపోయారు. తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. అయితే అది రాజకీయ ప్రత్యర్థులపై కాదు. తన అభిమానుల పైనే.. ఎందుకు అనుకుంటున్నారా? తిరుపతిలో ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపడంపై. తొక్కిసలాట జరిగి ఆరుగురు మృత్యువాత పడ్డారు. అక్కడ పరిస్థితిని తెలుసుకునేందుకు పవన్ వెళ్లారు. అటువంటి చోట అభిమానులు హల్చల్ చేశారు. పవర్ స్టార్ అని.. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. గుంపులు గుంపులుగా మీదకు దూసుకొస్తూ పవన్ సహనానికి పరీక్ష పెట్టారు. దీంతో అభిమానులపై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఒకానొక దశలో అయితే సహనం కోల్పోయారు.
* బాధితుల పరామర్శ తిరుపతిలో( Tirupati) తొక్కిసలాట జరిగి ఆరుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మరోవైపు గాయపడిన వారు తిరుపతి స్విమ్స్( swims) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించేందుకు నిన్న పవన్ వెళ్లారు. అయితే పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు. లోపలికి వెళ్లి బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసరికి ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. మీడియాతో మాట్లాడేందుకు పవన్ వెళుతున్న క్రమంలో పవర్ స్టార్ పవన్ స్టార్.. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడున్న వారంతా తమ ఫోన్లు తీసి.. ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. ఒకరినొకరు తోసుకుంటూ ఆయన వద్దకు చేరేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.
* పవన్ ఎమోషన్
అయితే బాధితులను పరామర్శించే క్రమంలో పవన్( Pawan) ఎమోషనల్ అయ్యారు. కానీ బయటకు వచ్చిన తర్వాత అభిమానులు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పవన్ సముదాయించే ప్రయత్నం చేసిన వారు వినలేదు. అరుపులు, కేకలతో హోరెత్తించారు. దీంతో పవన్ లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మనుషులు చచ్చిపోయారు.. మనుషులు చచ్చిపోయారు. మీరు క్రౌంటు కంట్రోల్ చేయండి. ఇది ఆనందించే సమయమా.. అరిచే సమయమా.. బాధ అనిపించట్లేదా.. అసలు మనం ఎక్కడికి ఏ పర్పస్ లో వచ్చామన్నది మరిచిపోయారా… బాధ్యత లేకపోతే ఎట్లా.. అందరినీ బ్లాక్ చేయండి.. కంట్రోల్ చెయ్యండి అంటూ పోలీసులను ఆదేశించారు. అభిమానులపై ఆగ్రహానికి గురయ్యారు.
* మీడియా సమావేశంలో అసహనం
మీడియా( press meet) సమావేశంలోనూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తప్పు పట్టారు. అత్యంత బాధాకరమైన సమయం ఇది. పోలీసులు అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆసుపత్రికి వస్తున్నానని తెలిసి కూడా క్రౌడ్ కంట్రోల్( crowd control) చేయకపోవడం పై మండిపడ్డారు. తాను కలుగజేసుకునేంతవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పవన్ వస్తుండడంతో అభిమానులను కంట్రోల్ చేయలేకపోయామని.. అది కూడా ఆసుపత్రి ప్రాంగణం కావడంతో ఎవరిని నియంత్రించగలమని పోలీసులు చెబుతున్నారు. అయితే పవన్ అభిమానులు మాత్రం ఒక్కసారిగా దూసుకు రావడం మాత్రం మరోసారి తొక్కిసలాట జరిగే పరిస్థితి కనిపించింది. దానిని చూసి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. అభిమానులపై విరుచుకుపడ్డారు. అయితే మానవ తప్పిదాలతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. పాపం పాపం చెబుతోంది అదే. కానీ అభిమానులు మాత్రం వినిపించుకోవడం లేదు.
పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం
ఇంత మంది పోలీసులు ప్రజలను ఆపకుండా ఏం చేస్తున్నారు
సంఘటన జరిగాక కూడా పోలీసులకు బాధ్యత లేకపోతే ఎలా? – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/H8ehzLGa2w
— Telugu Scribe (@TeluguScribe) January 9, 2025