దిల్ రాజు బన్నీని వదిలేసుకున్న‌ట్టేనా?

పుష్ప సినిమా త‌ర్వాత‌ అల్లు అర్జున్ నెక్స్ట్‌ మూవీ ఏంట‌నే విష‌య‌మై కొన్ని రోజులుగా చ‌ర్చ సాగుతోంది. కొర‌టాల శివ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్ధ‌మైపోవ‌డంతో.. బ‌న్నీకి జ‌త‌క‌లిసేది ఎవ‌ర‌నే క‌న్ఫ్యూజ‌న్ నెలకొంది. ఇలాంటి స‌మ‌యంలోనే ‘ఐకాన్’ ప్రాజెక్టు తెర‌పైకి వ‌చ్చింది. వ‌కీల్ సాబ్ బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో.. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫుల్ జోష్ లో ఉన్నారు. దీంతో.. త‌మ బ్యాన‌ర్ లో రాబోతున్న నెక్స్ట్ మూవీ ‘ఐకాన్’ అని ప్రకటించారు దిల్ రాజు. మూడేళ్ల […]

Written By: Bhaskar, Updated On : April 22, 2021 9:28 am
Follow us on

పుష్ప సినిమా త‌ర్వాత‌ అల్లు అర్జున్ నెక్స్ట్‌ మూవీ ఏంట‌నే విష‌య‌మై కొన్ని రోజులుగా చ‌ర్చ సాగుతోంది. కొర‌టాల శివ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్ధ‌మైపోవ‌డంతో.. బ‌న్నీకి జ‌త‌క‌లిసేది ఎవ‌ర‌నే క‌న్ఫ్యూజ‌న్ నెలకొంది. ఇలాంటి స‌మ‌యంలోనే ‘ఐకాన్’ ప్రాజెక్టు తెర‌పైకి వ‌చ్చింది.

వ‌కీల్ సాబ్ బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో.. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫుల్ జోష్ లో ఉన్నారు. దీంతో.. త‌మ బ్యాన‌ర్ లో రాబోతున్న నెక్స్ట్ మూవీ ‘ఐకాన్’ అని ప్రకటించారు దిల్ రాజు. మూడేళ్ల క్రిత‌మే ఈ ప్రాజెక్ట‌ను అనౌన్స్ చేశారు. కానీ.. అల‌వైకుంఠ‌పుర‌ములో చిత్రం మ‌ధ్య‌లోకి రావ‌డంతో.. ఈ ప్రాజెక్టు వాయిదా ప‌డిపోయింది.

ఇప్పుడు బ‌న్నీ నెక్స్ట్ మూవీ ఏంట‌న్న‌ది క్లారిటీ లేక‌పోవ‌డంతో.. ఐకాన్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడ‌నే ప్ర‌చారం సాగింది. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం ఈ చిత్రం నుంచి బ‌న్నీ ఔట్ అయ్యాడ‌ని తెలుస్తోంది. దీనికి ప‌లు కార‌ణాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి.

ఈ చిత్రం క‌థ‌లో మార్పులు చేయాల‌ని బ‌న్నీ సూచించాడ‌ట‌. అంతేకాదు.. అప్పుడు అనుకున్న‌దానిక‌న్నా రెమ్యున‌రేష‌న్ పెంచాల‌ని కోరాడ‌ట‌. అలాగైతేనే ఈ సినిమా చేస్తాన‌ని చెప్పాడ‌ట‌. అయితే.. ఈ రెండు విష‌యాల‌కు ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్‌, నిర్మాత దిల్ రాజు ఇద్ద‌రూ అంగీక‌రించ‌లేద‌ని తెలుస్తోంది. ఈ కార‌ణం చేత‌నే.. బ‌న్నీ ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడ‌ని చెప్పుకుంటున్నారు.

దీంతో.. వేరే హీరోతో ఈ ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నార‌ట మేక‌ర్స్‌. ఈ క‌థ‌కు ఏ హీరో సెట్ అవుతాడోన‌ని చూస్తున్నార‌ట దిల్ రాజు, వేణు. మ‌రి, ఇందులో వాస్త‌వం ఎంత‌? ఇదే నిజ‌మైతే.. రాబోయే కొత్త ఐకాన్ ఎవ‌రు? అన్న‌ది చూడాలి.