Allu Arjun : నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా, ఆయన చేయబోయే తదుపరి చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ ని కాసేపటి క్రితమే అధికారికంగా సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్ళు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఈ వీడియోలో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ(Director Atlee) తో కలిసి లోలా(Lola) ‘VFX’ కంపెనీ కి వెళ్తారు. అక్కడ వాళ్ళు గతంలో పని చేసిన హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన VFX పరికరాలను మొత్తం వీళ్లిద్దరికీ చూపిస్తూ వివరిస్తూ ఉంటారు. అసలు ఈ లోలా సంస్థ ప్రత్యేకత ఏమిటి?, ఎందుకు అల్లు అర్జున్ పట్టుబట్టి మరీ ఆ కంపెనీ ని ఎంచుకున్నాడు?, VFX కోసం వీళ్ళు ఉపయోగించే అడ్వాన్స్ టెక్నాలజీ ఏమిటి?, ఇంతకు ముందు వీళ్ళు చేసిన సినిమాలేంటి? వంటివి ఇప్పుడు మనం చూడబోతున్నాము.
Also Read : అల్లు అర్జున్, రామ్ చరణ్, రాజమౌళి..2000 కోట్ల బడ్జెట్ సినిమా రెడీ!
అమెరికా లో కొలువుదీరిన ఈ లోలా VFX సంస్థ ఇప్పటి వరకు హాలీవుడ్ అవతార్, జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సెన్సేషనల్ సినిమాలను అందించారు. ఈ చిత్రాల్లో VFX ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సహజత్వానికి ఎంతో దగ్గరగా VFX ఉంటుంది. అందుకోసం వాళ్ళు అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తుంటారు. ప్రపంచం లో ఎక్కడా కూడా వీళ్ళు వాడే టెక్నాలజీ అందుబాటులో ఉండదు. అందుకే అందరూ ఈ కంపెనీ కే కాంట్రాక్ట్స్ ఇస్తుంటారు. సౌత్ లో ఇప్పటి వరకు ఈ సంస్థ కల్కి, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, ఇండియన్ 3 వంటి చిత్రాలకు పని చేసింది. ‘కల్కి’ చిత్రంలో గ్రాఫిక్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మనమంతా చూసాము. ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు గా ఉంటుంది ఈ సినిమా. కానీ విజయ్ నటించిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (GOAT) చిత్రానికి మాత్రం గ్రాఫిక్స్ విషయంలో ట్రోల్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది.
ముఖ్యంగా విజయ్ యంగ్ లుక్ పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారింది. ఏదైనా డైరెక్టర్ పని తనం ని బట్టి ఉంటుంది అనేది స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అట్లీ కచ్చితంగా ఇండియా లోనే ది బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరు. ముఖ్యంగా ఆయన కమర్షియల్ సినిమాలు సాధించిన విజయాలను చూస్తే, ఆయన ఏ రేంజ్ డైరెక్టర్ అనేది అర్థం అవుతుంది. ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ ఎలా అయితే అలోచించి సినిమాలు చేసేవాడో, ఇప్పుడు అట్లీ అలాంటి సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటి వరకు మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జక్ట్స్ తో ప్రేక్షకులను అలరించిన అట్లీ, ఇన్నాళ్లకు జానర్ ని మార్చి సైన్స్ ఫిక్షన్ జానర్ తో మన ముందుకు రాబోతున్నాడు. చూడాలి మరి తనకు అలవాటు లేని జానర్ లో ఎంత మేరకు సక్సెస్ ని సాధించగలడు అనేది.
Also Read : అవతార్ సినిమాని తలపిస్తున్న అల్లు అర్జున్, అట్లీ మూవీ మేకింగ్ వీడియో!