Allu Arjun – Atlee Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Altee) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, ముందుగా త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందా?, లేదా అట్లీ తో ఉంటుందా అనే సందిగ్ధం లో ఇన్ని రోజులు ఉన్నారు అభిమానులు. కానీ అట్లీ తోనే ఉండబోతుందని, అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు అధికారికంగా ఒక వీడియో ద్వారా ప్రకటిస్తామని ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్(Sun Pictures) సంస్థ రెండు రోజుల క్రితమే అధికారిక ప్రకటన చేసింది. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒక మేకింగ్ వీడియో ద్వారా తెలిపారు మేకర్స్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది.ఈ వీడియో ని చూసి హీరో అల్లు అర్జున్ డెడికేషన్ కి అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు.
Also Read : అల్లు అర్జున్ అట్లీ మూవీ ఓపెనింగ్ డేట్ వచ్చేసిందిగా..?
ఈ వీడియో లో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ తో కలిసి హాలీవుడ్ లో అవతార్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఇలా ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు పని చేసిన VFX కంపెనీ కి వెళ్తారు. అక్కడ VFX కంపెనీ కి చెందిన వాళ్ళు గతంలో వాళ్ళు పని చేసిన సినిమాలకు సంబంధించిన వర్క్స్ మొత్తాన్ని చూపిస్తూ ఉంటారు. చివర్లో అల్లు అర్జున్ తో కొన్ని షాట్స్ ని చిత్రీకరించి తాము భవిష్యత్తులో ఎలాంటి సినిమా చేయబోతున్నామో ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమా సూపర్ హీరో జానర్ లో తెరకెక్కనుంది. ఇది వరకు మనం హాలీవుడ్ లోనే ఇలాంటి సినిమాలు చూసాము, మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటి జానర్స్ పై ఇప్పటి వరకు సినిమాలు రాలేదు. వచ్చిన అడపాదడపా సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా మాత్రం హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండబోతుందని తెలుస్తుంది. డైరెక్టర్ అట్లీ కి ఇలాంటి జానర్ సినిమా కొత్త అనొచ్చు. ఇది వరకు ఆయన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటి జానర్ లో చూసేసరికి అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఇప్పటి వరకు చూడని జానర్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఆడియన్స్ మైండ్ సెట్ ని కూడా మార్చేయగలదు. అలాంటి ప్రాజెక్ట్ అయితేనే అల్లు అర్జున్ డేట్స్ ఇస్తాడు అనేది మరోసారి స్పష్టమైంది. పుష్ప సిరీస్ తో నేషనల్ లెవెల్ లో జెండా పాతి తెలుగోడి సత్తా చాటి చెప్పిన అల్లు అర్జున్, ఈ సినిమాతో ఏ రేంజ్ కి వేళ్తాడో, తెలుగోళ్ళను ఇంకా ఎంత గర్వపడేలా చేస్తాడో చూడాలి.
Also Read : అల్లు అర్జున్ కి జంటగా గ్లోబల్ బ్యూటీ, అట్లీ మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్!
Gear up for the Landmark Cinematic Event⚡✨#AA22xA6 – A Magnum Opus from Sun Pictures@alluarjun @Atlee_dir #SunPictures #AA22 #A6 pic.twitter.com/MUD2hVXYDP
— Sun Pictures (@sunpictures) April 8, 2025