Allu Arjun And Ram Charan: పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న మన టాలీవుడ్ హీరోల లిస్ట్ తీస్తే అందులో మనకు గుర్తుకు వచ్చే పేర్లు అల్లు అర్జున్(Icon star Allu Arjun), రామ్ చరణ్(Global star Ram Charan), ప్రభాస్(Rebel Star Prabhas). ఎలాంటి జానర్ లో అయినా నటించగల సత్తా ఉన్నా హీరోలు వీళ్ళు. ఇక రాజమౌళి(SS Rajamouli) బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంచి చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతో మల్టీ స్టార్రర్ సినిమాలు చేయడానికి ఎవ్వరూ సాహసం చేయరు. కానీ #RRR తో రాజమౌళి ఆ సాహసం చేసి, పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి, ఏకంగా ఆస్కార్ అవార్డ్స్ ని మన టాలీవుడ్ కి తెచ్చిపెట్టాడు. ఇప్పుడు రాజమౌళి మరో క్రేజీ మల్టీస్టార్రర్ తో, #RRR ని మించిన అద్భుతాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్లాన్ లో ఉన్నాడు.
Also Read: అలాంటి పనులు చేస్తేనే నేను ప్రశాంతంగా ఉంటాను : రకుల్ ప్రీత్ సింగ్
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కేవలం ఒక్క భాగంలోనే ముగిస్తారట. బాహుబలి, పుష్ప తరహా లో సీక్వెల్స్ చేయడానికి అవకాశం లేదట. కాబట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే రాజమౌళి రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక క్రేజీ మల్టీస్టార్రర్ ని చేయబోతున్నట్టు తెలుస్తుంది. చాలా ఏళ్ళ క్రితం ఆయన ‘గరుడ’ అనే సబ్జెక్టు మీద స్క్రిప్ట్ ని రెడీ చేయించాడు. రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ ఇది. ఇద్దరు హీరోలు కచ్చితంగా అవసరం ఉన్న స్టోరీ. ఈ చిత్రాన్ని ఎప్పటి నుండో తీయాలని అనుకుంటున్నాడు కానీ, బడ్జెట్ కుదరక పక్కన పెట్టేసాడు. టాలీవుడ్ మార్కెట్ ఈ స్థాయిలో పెరిగింది అనే విషయం రాజమౌళి కి ముందే తెలిసి ఉండుంటే, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో #RRR కి బదులు ‘గరుడ’ చిత్రాన్ని చేసి ఉండేవాడు.
ఈ చిత్రాన్ని నిర్మించడానికి దాదాపుగా 2000 కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుందట. మహేష్ బాబు తో ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న సినిమా బడ్జెట్ వెయ్యి కోట్ల రూపాయిల పైమాటే. ఈ సినిమాతో ఆయన ఇంటర్నేషనల్ మార్కెట్స్ ని టార్గెట్ చేశాడు. #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు రాజమౌళి కి ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు లభించింది. ఇప్పుడు ఏకంగా ఆ మార్కెట్ ని టార్గెట్ గా చేసుకొని తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి, ఇది కమర్షియల్ గా హిట్ అయితే కచ్చితంగా రాజమౌళి తదుపరి చిత్రానికి ఇంటర్నేషనల్ లెవెల్ లో మంచి డిమాండ్ ఉంటుంది. అప్పుడు రెండు వేల కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు, మూడు వేల కోట్లు ఖర్చు చేసినా వర్కౌట్ అవుతుంది. చూడాలి మరి, మూడేళ్ళ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఈ చిత్రానికి కాల్ షీట్స్ ఇవ్వొచ్చు.