Vignesh puthur
Vignesh puthur : ఐపీఎల్ ద్వారా ఎంతోమంది ఆటగాళ్ల ప్రతిభ ప్రపంచానికి తెలిసింది.. ఐపీఎల్ ద్వారా ప్రతిభావంతమైన ఆటగాళ్లు టీమిండియాలోకి రావడానికి మార్గం సుగమం అయింది. అందుకే ఐపీఎల్ లో ఆడాలని చాలామంది యువ ఆటగాళ్లు కోరుకుంటారు. తమను కొనుగోలు చేసేందుకు మెగా, మినీ వేలంలలో పేర్లు నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18 ఎడిషన్ లో సంచలన ఆటగాడిగా వెలుగులోకి వచ్చాడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆటగాడు విగ్నేష్ పుతూర్(Vignesh puthur). ఇతడి తండ్రి ఒక ఆటో డ్రైవర్. అయినప్పటికీ విగ్నేష్ క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని చంపుకోలేదు. తనకు పేదరికం అడ్డుగా ఉన్నప్పటికీ.. ప్రతిభను మాత్రమే నమ్ముకున్నాడు. కష్టాన్ని మాత్రమే విశ్వసించాడు. అందువల్లే ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. దీంతో ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోయాడు. దీంతో అతడి ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది. సరిగ్గా రెండు రోజుల క్రితం అతనికి 24.9 వేల మంది ఫాలోవర్స్ ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 3 లక్షల 28 వేలకు చేరుకుంది. ఈ కథనం రాసే సమయానికి అది ఇంకా పెరుగుతూనే ఉంది.. ఆటో డ్రైవర్ కొడుకు చెన్నై మైదానంలో చెన్నై ఆటగాళ్లకు చుక్కలు చూపించాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. విగ్నేష్ ను చూసి సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్(Sachin Tendulkar son Arjun Tendulkar) నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు.
Also Read : క్షణం క్షణం ఉత్కంఠ.. సీట్ ఎడ్జ్ మ్యాచ్ అంటే ఇది..
స్వయంగా నీతా అంబానీ వచ్చి..
చిన్న గట్టుతో జరిగిన మ్యాచ్లో విగ్నేష్ పుతూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చెన్నై మైదానంలో చెన్నై ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. దీంతో అతడు ఒకసారిగా ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోయాడు.. ఈ మ్యాచ్లో ముంబై జట్టు(Mumbai Indians team) ఓడిపోయినప్పటికీ.. అతడికి ముంబై ఇండియన్స్ జట్టు ఓనర్ నీతా అంబానీ (Mumbai Indians cricket team Neeta Ambani) స్వయంగా వచ్చి బెస్ట్ బౌలర్ బ్యాడ్జి ని విగ్నేష్ కు అందించారు. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) జట్టుతో జరిగిన మ్యాచ్లో విగ్నేష్ శివం దుబే (9), దీపక్ హుడా(3) క్రికెట్లను పడగొట్టాడు. తనకు మాత్రమే సొంతమైన స్పిన్ మాయాజాలంతో మూడు వికెట్ల సొంతం చేసుకున్నాడు. అయితే ముంబై జట్టు ఓడిపోయినప్పటికీ.. విగ్నేష్ ప్రదర్శన ఆకట్టుకుంది. అందువల్లే నీతా అంబానీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి అతనికి ఉత్తమ బౌలర్ బ్యాడ్జి అందించారు..” ఈరోజు జరిగిన మ్యాచ్లో మనం ఓడిపోయినప్పటికీ.. మన యువ స్పిన్ బౌలర్ విగ్నేష్ సత్తా చూపించాడు. అతడు అద్భుతమైన ప్రశ్నలతో ఆకట్టుకున్నాడు.. ఇంతకీ అతడెక్కడ.. విగ్నేష్.. విగ్నేష్ అంటూ” నీతా అంబానీ పదేపదే పలవరించారు. చివరికి అతడు ఆమె దగ్గరికి రావడంతో ఉత్తమ బౌలర్ బ్యాడ్జి అతనికి అందించారు. ఈ సమయంలో విగ్నేష్ నీతా పాదాలకు నమస్కరించారు.
Also Read : నవ్వుతుంటే చిన్నపిల్ల అనుకున్నారా.. ఆమె సృష్టించిన డైనోసార్ టీం ఇది..