Allu Arjun Trivikram movie stopped reasons : ‘అలా వైకుంఠపురం లో’ చిత్రానికి ముందు అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కేవలం ఒక మామూలు హీరో మాత్రమే. ఆయన్ని స్టార్ హీరో గా అందరూ పరిగణలోకి తీసుకోవడం ఈ చిత్రం నుండే మొదలైంది. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమాకు ముందు అల్లు అర్జున్, త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’,’ సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాలు కూడా కమర్షియల్ గా బాగా ఆడాయి. ముఖ్యంగా జులాయి చిత్రానికి ముందు అల్లు అర్జున్ చాలా గడ్డు కాలాన్ని ఎగురుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ చిత్రం ఆయనకు చేసిన మేలు సాధారణమైనది కాదు. అలా త్రివిక్రమ్ అల్లు అర్జున్ కెరీర్ వేరే లెవెల్ కి వెళ్లేందుకు ఎంతో సహాయపడ్డాడు. అందుకు త్రివిక్రమ్ అంటే అల్లు అర్జున్ కి ఎంతో ప్రేమ ఏర్పడింది.
అయితే వీళ్ళ కాంబినేషన్ లో నాల్గవసారి ఒక మైథలాజికల్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎవ్వరూ చూడని ఘట్టం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని, కార్తికేయ స్వామి జీవితంలోని ముఖ్యమైన ఘట్టం అని, ఎన్టీఆర్ కాలం లో కూడా ఈ సబ్జెక్టు ని ముట్టుకోలేదని, సరిగ్గా తీస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించవచ్చని ఇలా సోషల్ మీడియా లో ఎన్నో కథనాలు ప్రచారం అయ్యాయి. అయితే అల్లు అర్జున్ కి ‘పుష్ప 2’ తర్వాత రెండు ఛాయస్ లు వచ్చాయి. ఒకటి అట్లీ తో సినిమా చేయడం, లేకపోతే త్రివిక్రమ్ తో ఈ మైథలాజికల్ మూవీ ని మొదలు పెట్టడం. అందరూ త్రివిక్రమ్ సినిమాని ముందుగా మొదలు పెడతారని అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అట్లీ సినిమాని ముందుగా ఒప్పుకున్నాడు.
Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి సంచలన అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!
ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే జరిగింది. నేడు పూజ కార్యక్రమాలు జరిగాయి, రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. అయితే రీసెంట్ గానే త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ మధ్య ఒక ముఖ్యమైన భేటీ జరిగిందట. అట్లీ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు నిన్ను వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు, ఈ కథ వేరే హీరో తో చేయాలనుకుంటే చెయ్యి, మనం ఫ్రెష్ గా వేరే కాన్సెప్ట్ తో సినిమా చేద్దామని అన్నాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ తో ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారు. మన పురాణ చరిత్రలు సంబంధించిన స్టోరీలు అల్లు అర్జున్ కంటే ఎన్టీఆర్ కి బాగా సూట్ అవుతాయి, ఈ ప్రాజెక్ట్ చేరాల్సిన చోటకే చేరింది అంటూ నేషన్స్ కామెంట్స్ చేస్తున్నారు.