Homeఎంటర్టైన్మెంట్Tollywood Industry: టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవరు? సినీ ఇండస్ట్రీలో మొదలైన వివాదం...

Tollywood Industry: టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవరు? సినీ ఇండస్ట్రీలో మొదలైన వివాదం…

Tollywood Industry: సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఎవ్వరికి అర్థంకానీ ప్రశ్న… ఒకప్పుడు దాసరి నారాయణరావు ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే చూపించేవాడు. ఆయన మాట ఒక శాసనం ల పాటించేవారు. అలాగే ఆయన చేసే సెటిల్ మెంట్ కూడా ప్రతి ఒక్కరికి నచ్చేది. ఎవరు నష్టపోకుండా ఆయన ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి లాభం చేకూరేలా ఏదైనా మంచి నిర్ణయాన్ని తీసుకునేవాడు. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు ఆయన ఎప్పుడు అండగా ఉండేవాడు. చిన్న సినిమాని బతికిస్తేనే పెద్ద సినిమాలు కూడా బతుకుతాయి అనే ఒక ధోరణిలో చిన్న ప్రొడ్యూసర్లకు చాలా ఫేవర్ గా ఉండేవాడు. పండుగల సమయంలో కూడా చిన్న సినిమాలకు థియేటర్లను ఇప్పించిన ఘనత అతనికే దక్కుతుంది. ఇక రీసెంట్ గా ‘తమ్మారెడ్డి భరద్వాజ్’ ‘వదలా’ అనే ఒక సినిమా ఫంక్షన్లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్దదిక్కు ఎవరు అని అడిగిన ప్రశ్నకు సంచలమైన సమాధానమైతే చెప్పాడు.

Also Read: ఇప్పటి 131 కోట్లు కాదు.. ఆ రోజుల్లోనే 25,000.. బీసీసీఐ చేసిన పనికి యావత్ ప్రపంచం నోరు వెళ్ళబెట్టింది!

ఇండస్ట్రీలో పెద్ద దిక్కు అనేవారు ఎవరు లేరని ఇక్కడ అలాంటి పదవి గాని, పేరు గాని ఏది ఉండదని ఇంతకుముందు ఒక మనిషి కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చూపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్లి సొల్యూషన్ వెతుక్కోవడం వల్ల అతను పెద్దదిక్కుగా అందరు భావించారు. అంతే తప్ప ఇక్కడ ‘పెద్ద దిక్కు’ అనే పదవి గాని, పేరు గాని ఏది లేదని చెప్పాడు. ఇక ఆయన చేసిన పనులు చాలా గొప్పవి అంటూ పేరు పెట్టకుండానే దాసరి నారాయణరావు గారి గురించి చెప్పాడు.

ఇక ఆయన లాంటి మరొక మనిషి ఇండస్ట్రీలో వస్తాడు అని మేము అనుకోవడం లేదు. అసలు రారు కూడా అంటూ ఆయన ఘాటు కామెంట్లు చేశాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కరోనా సమయంలో ఇండస్ట్రీలో ఉన్న సినీ కార్మికులను ఆదుకున్నాడు. ముఖ్యంగా ఆ సమయంలో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా మారితే ఇండస్ట్రీ బాగుపడుతుందని చాలామంది అనుకున్నారు. కానీ అతనికి కొంతమంది నుంచి వ్యతిరేకత రావడంతో ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని నేను అనుకోవడం లేదు.

ఏదైనా ప్రాబ్లం నాదాక వస్తే దానికి సొల్యూషన్ చూపిస్తా అంతే తప్ప ఇండస్ట్రీ పెద్ద అనే మాట నాకు అవసరం లేదు అంటూ ఆయన సమాధానం ఇచ్చాడు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడిన మాటలు చిరంజీవిని ఉద్దేశించే చెప్పాడా? ఎందుకని ఆయన అలాంటి మాటలు మాట్లాడాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఆయన మాట్లాడిన మాటలకు కొంతమంది మెగా అభిమానులు సైతం ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular