Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ (Young Rebal Star) గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…ఆయన చేసిన ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకుపండరి మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక బాహుబలి (Bahubali) సినిమాతో తనకంటూ పాన్ ఇండియాలో గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత నుంచి వచ్చిన ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక వరుసగా సలార్(Salaar), కల్కి (Kalki) సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు హను రాఘవపూడి (Hanu Raghavpudi) దర్శకత్వంలో ఫౌజీ(Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక హను రాఘవ పూడి సైతం గతంలో సీతా రామం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ సినిమా ఒక క్లాసికల్ సినిమాగా మిగిలిపోవడమే కాకుండా ఆయన కాంతి చాలా గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన ప్రభాస్ తో చేస్తున్న సినిమా ఎలా ఉండబోతుంది.
Also Read : తిరుమలలో 17 లక్షల రూపాయలతో అన్నదానం చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి!
ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేస్తే బాగుంటుందంటు అభిమానులు సైతం కొంతవరకు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గానీ, గ్లింప్స్ గాని రిలీజ్ చేయాలనే ఆలోచనలు మేకర్స్ అయితే ఉన్నారట.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా చివర్లో ప్రభాస్ చనిపోబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక హను రాఘవపూడి సినిమాల్లో హీరోలు చనిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఆయన తీసిన మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ సినిమాలో రాహుల్ క్యారెక్టర్ చనిపోతుంది.
ఇక అలాగే ‘సీతారామం’ సినిమాలో హీరో అయిన దుల్కర్ సల్మాన్ పాత్ర కూడా చివర్లో చనిపోతుంది. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా ఒక మెలో డ్రామా ని యాడ్ చేసి సినిమా చివర్లో ప్రభాస్ ను చంపేయబోతున్నాడా అనే వార్తలైతే వస్తున్నాయి…ఇక ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : భీమవరంలో కొత్త హాస్పిటల్..ఉచిత వైద్యం..గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్!