Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న చాలా మంది హీరోలు మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్ కి కూడా చాలా ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. ప్రస్తుతం ఆయన ఇండియా వైడ్ గా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక దానికి సిక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా మేనియా అయితే వేరే లెవెల్లో ఉంది. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో కూడా పెను ప్రభంజనాన్ని సృష్టించి టాప్ హీరోగా ఎదుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా తనదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది. ఇక ఏది ఏమైనా కూడా డిసెంబర్ 5వ తేదీన పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి వీళ్ళిద్దరూ రెడీ అవుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే సినిమా యూనిట్ ఈ సినిమా మీద భారీ కాన్ఫిడెంట్ గా ఉండడం అనేది చూసే ప్రేక్షకులను కూడా ఆనంద పడేలా చేస్తుందనే చెప్పాలి. మరి మొదటి షో తో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నట్లైతే పుష్ప 2 భారీ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య సన్నిహిత సంబంధాలు లేవు అంటూ మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ఇద్దరు తీవ్రమైన విమర్శలైతే చేసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళు ఇప్పుడు కలిసిపోయారనే సంకేతలైతే వినిపిస్తున్నాయి.
ఇక దానికి ఇచ్చినట్టుగానే రీసెంట్ గా అల్లు అర్జున్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి ఒక ట్వీట్ అయితే చేశాడు. ఇక ఏపీలో పుష్ప 2 సినిమా టికెట్ల రేటు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అంటూ తను ఒక ట్విట్ చేశాడు.
ఇక ఏది ఏమైనా కూడా డిసెంబర్ 4వ తేదీ నుంచి ఏపీలో బెనిఫిట్ షోస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మొదటి షో స్టార్ట్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్కో టికెట్ మీద 200 రూపాయలు అదనంగా చార్జ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక 5 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్ మీద వంద రూపాయలు, మల్టీప్లెక్స్ ల్లో 200 రూపాయలను అదనంగా ఛార్జ్ చేసి సినిమా ప్రొడ్యూసర్స్ కి భారీ కలెక్షన్స్ వచ్చే విధంగా ఏపీ గవర్నమెంట్ కూడా సహకరిస్తున్నందుకు వాళ్లందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతుంది…