https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : రాజమౌళి మహేష్ బాబు ఇద్దరి టార్గెట్ ఒకేటేనా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి మంచి గుర్తింపైతే ఉంటుంది. ముఖ్యంగా ఒక సినిమా సక్సెస్ అవ్వలంటే దర్శకుడు యొక్క ప్రతిభ అనేది చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 3, 2024 / 11:29 AM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli and Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి మంచి గుర్తింపైతే ఉంటుంది. ముఖ్యంగా ఒక సినిమా సక్సెస్ అవ్వలంటే దర్శకుడు యొక్క ప్రతిభ అనేది చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది. హీరో తెరమీద కనిపించినప్పటికి దర్శకుడి విజన్ ప్రకారమే అతను మూవ్ అవుతూ ఉంటాడు. కాబట్టి దర్శకుడు హీరోని ఎలా చూపించాలి అనుకుంటాడో అంత భారీ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ చూపించినప్పుడే సినిమా అనేది ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చుతుంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ఈయన చేస్తున్న ప్రతీ సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. తెలుగు సినిమా స్థాయిని ఏకంగా పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఎప్పుడైతే ఆయన బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ స్టేటస్ లో ముందుకు దూసుకెళుతుందనే చెప్పాలి. ఆయన వేసిన బాటలోనే మిగతా దర్శకులందరు నడుస్తూ ఒకరిని మించిన సక్సెస్ లతో మరొకరు ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే దర్శకులు ఉన్న ఈ రోజుల్లో ఇప్పటికి రాజమౌళి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా భారీ చిత్రాలను తీస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఏదిఏమైనా కూడా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.

    ఇక అందులో భాగంగానే మహేష్ బాబుతో కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ రేంజ్ లో రూపొందించబోతున్నారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి మహేష్ బాబు ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం భారీ రేంజ్ లో సక్సెస్ అయితే మాత్రం తెలుగు సినిమాకి ఒక గొప్ప అవకాశం అయితే దక్కుతుంది.

    పాన్ వరల్డ్ సినిమా రేంజ్ కి మన సినిమా వెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక అక్కడి దర్శకులు అయిన జేమ్స్ కేమెరాన్ లాంటి దర్శకులతో రాజమౌళి పోటీపడి మరి గెలుస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుతున్న ఈ దర్శకుడు 3000 కోట్ల మార్కును అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

    ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడి అయిన సరే ఈ సినిమాని సక్సెస్ చేయాలని తను ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు ఇద్దరికి కనిపించే టార్గెట్ 3000 కోట్ల కలెక్షన్స్ మాత్రమే అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…