Allu Arjun-Sneha Reddy : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పిలవబడే జంటలలో ఒకటి అల్లు అర్జున్, స్నేహా రెడ్డి జంట. వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. అంతటి క్యూట్ జంట. మీడియా కి ఎప్పుడూ దూరం ఉండడానికి ఇష్టపడే స్నేహా రెడ్డి, సోషల్ మీడియా లో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనకి తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది స్నేహా రెడ్డి. ముఖ్యంగా ఈమె అప్లోడ్ చేసే అల్లు అర్హ, అల్లు అయాన్ వీడియోలకు మామూలు రేంజ్ రెస్పాన్స్ రాదు. ఇంస్టాగ్రామ్ లో ఈమెకు దాదాపుగా 9 మిలియన్ కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లకు కూడా ఈ రేంజ్ ఫాలోవర్లు లేకపోవడం గమనార్హం.
ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్, అల్లు స్నేహా రెడ్డి కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది. రీసెంట్ గానే ఆయన ‘అన్ స్టాపబుల్ 4’ షోకి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ షోలో ఆయన తన భార్య అల్లు స్నేహా రెడ్డి గురించి పలు విషయాలు చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరికీ ఒక సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ ఉందట. ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు, వాళ్లిద్దరూ ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారానే చర్చించుకుంటారట. అలాగే ఈ వాట్సాప్ గ్రూప్ లో ఎన్ని రహశ్యాలను, భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా మాట్లాడుకుంటారట. ఈ గ్రూప్ లో కేవలం వీళ్లిద్దరు మాత్రమే ఉంటారని, ఇంట్లో ఎవ్వరికీ కూడా ఈ రహస్య వాట్సాప్ గ్రూప్ గురించి తెలియదని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ సినిమా నుండి ఒక డ్యూయెట్ సాంగ్, ఐటెం సాంగ్ విడుదల కావాల్సి ఉంది. ఈ రెండిటిని సినిమా విడుదలకు వారం రోజుల ముందు విడుదల చేస్తారట. శ్రీలీల తో చేసిన ఐటెం సాంగ్ అద్భుతంగా వచ్చిందని టాక్. డిసెంబర్ 5 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని భారీ ఎత్తున చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట మేకర్స్. మొన్న పాట్నా లో జరిపిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంది. అలాంటి ఈవెంట్స్ రాబోయే రోజుల్లో చాలానే ఉండబోతున్నాయి.