Homeఎంటర్టైన్మెంట్Allu Arjun-Sneha : 14వ పెళ్లి రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్-స్నేహ.. వీరి క్రేజీ లవ్...

Allu Arjun-Sneha : 14వ పెళ్లి రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్-స్నేహ.. వీరి క్రేజీ లవ్ స్టోరీ తెలుసా? సినిమాలకు మించిన ట్విస్ట్స్

Allu Arjun-Sneha : ప్రేమ.. ఎప్పుడు? ఎలా? ఎవరి మీద పుడుతుందో? చెప్పలేం. ఇక ప్రేమకు అందరూ అతీతులే. సామాన్యుడు, సెలెబ్రిటీ అనే తేడా ఉండదు. అందుకే ప్రేమ విశ్వజనీనం అంటారు. పాన్ ఇండియా అల్లు అర్జున్ సైతం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అల్లు అర్జున్-స్నేహారెడ్డి ప్రేమకథలో చాలా ట్విస్ట్స్ ఉన్నాయి. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ కి స్నేహారెడ్డి పరిచయమైందట. వేడుకలో మొదటిసారి కలుసుకున్నారట. అప్పుడు చూపులతో పాటు ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్ ఛేంజ్ అయ్యాయట.

తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారట. ఈ క్రమంలో ఒకరిపై మరొకరికి ఇష్టం కలగడం, అది ప్రేమగా మారడం జరిగిపోయాయి. ఆలస్యం చేయకుండా అల్లు అర్జున్ తన ప్రేమ వ్యవహారం తండ్రి అల్లు అరవింద్ కి చెప్పాడట. కొడుకు కోరికను కాదనలేక నేరుగా పిల్లలను అడగడానికి స్నేహారెడ్డి ఇంటికి వెళ్ళాడట అల్లు అరవింద్. స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థల అధిపతి. అల్లు అరవింద్ వంటి బడా ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్లి కోరినా.. చంద్రశేఖర్ రెడ్డి నిరాకరించాడట.

Also Read : చంచల్ గూడ జైలులో అల్లు అర్జున్ కి అంత అవమానం జరిగిందా?… నాకు ఎదురైదే ఆయనకు కూడా అంటూ, బాంబు పేల్చిన నటి!

సినిమా వాళ్ళకు అమ్మాయిని ఇవ్వడం ఇష్టం లేదని అన్నాడట. బ్రతిమిలాడినా లాభం లేదని అల్లు అరవింద్ వెళ్ళిపోయాడట. అయితే స్నేహారెడ్డి మాత్రం గట్టిగా పట్టుబట్టిందట. పెళ్లంటూ చేసుకుంటే అల్లు అర్జున్ ని మాత్రమే చేసుకుంటా.. అని నొక్కి చెప్పిందట. కూతురు మనసు కష్టపెట్టలేక చంద్రశేఖర్ రెడ్డి చివరికి అంగీకరించారట. దాంతో అల్లు అర్జున్-స్నేహారెడ్డి ఫుల్ హ్యాపీ. 2011 మార్చ్ 6న హైదరాబాద్ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది.

టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గా అల్లు అర్జున్, స్నేహ పేరు తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. అబ్బాయి పేరు అయాన్ కాగా, అమ్మాయి అర్హ. శాకుంతలం మూవీతో అర్హ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం విశేషం. సమంత లీడ్ రోల్ చేసిన శాకుంతలం చిత్రంలో అర్హ బాల భరతుడిగా నటించి మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో స్నేహారెడ్డి చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్. యోగ, వ్యాయామం తన దినచర్యలో భాగంగా ఉంటుంది. అందంలో హీరోయిన్స్ ని తలదన్నేలా ఉండే స్నేహారెడ్డి.. ఫోటో షూట్స్ సైతం చేస్తుంది.

Also Read : నెల రోజుల పాటు అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనింగ్..దేనికోసం ఇంత కష్టం? అయోమయంలో పడిన ఫ్యాన్స్!

RELATED ARTICLES

Most Popular