PM Modi: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్తున్నాయి. కేంద్రంలో టిడిపి, జనసేన కీలక భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో బిజెపి కీలక భాగస్వామిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి తరుపున ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా అభినందించారు. కూటమికి దిశా నిర్దేశం చేశారు. దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: ఇక దువ్వాడ వంతు.. రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు.. అరెస్టు తప్పదా?
* విజేతలకు అభినందనలు
ఇటీవల రెండు పట్టభద్రుల స్థానాలతో( graduate MLC) పాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగిన సంగతి తెలిసింది. రెండు పట్టభద్రుల స్థానాల్లో టిడిపి అభ్యర్థులు ఆలపాటి రాజా, పేరా బత్తుల రాజశేఖర్ విజయం సాధించారు. తెలంగాణలో రెండు స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు. తన ఎక్స్ ఖాతా ద్వారా అభినందనలు తెలిపారు.’ విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోనూ మరియు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి’ అని పేర్కొన్నారు.
* స్పందించిన సీఎం చంద్రబాబు
అదే సమయంలో ప్రధాని మోదీ( Prime Minister Modi) పోస్ట్ పై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు.’ ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రంలోని ఎన్డీఏ పక్షాల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నేతృత్వంలో ఎన్డీఏ మరెన్నో విజయాలను సాధిస్తుందని నమ్ముతున్నాను. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాను’ అంటూ చంద్రబాబు పోస్ట్ చేశారు. ఇప్పుడు కూటమి పార్టీల సోషల్ మీడియాలో ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
* అంతటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫీవర్
మరోవైపు ఏపీవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయ్యింది. ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఈనెల 20న జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు పేరు ఖరారు అయింది. మిగతా నాలుగు టీడీపీ దక్కించుకుంటుందా? లేకుంటే ఒక పదవి బిజెపికి కేటాయిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: నాగబాబు, పిఠాపురం వర్మ ఓకే.. మిగతా ఆ నలుగురు ఎవరు?
విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోను మరియు ఆంధ్రప్రదేశ్లోని ఎన్డిఎ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి మరియు రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి. https://t.co/PYDKFgT20A
— Narendra Modi (@narendramodi) March 6, 2025