Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Valentines Day video: 'వాలెంటైన్స్ డే' రోజున గుండెల్ని పిండేసే వీడియోని షేర్...

Allu Arjun Valentines Day video: ‘వాలెంటైన్స్ డే’ రోజున గుండెల్ని పిండేసే వీడియోని షేర్ చేసిన అల్లు అర్జున్..!

Allu Arjun Valentines Day video: ఒక పక్క తన తమ్ముడు పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతుంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మాత్రం ముంబై లో అట్లీ మూవీ షూటింగ్ తో క్షణ కాలం తీరిక లేక గడుపుతున్నాడు. ఈ సందర్భంగా నిన్న ఏర్పాటు చేసిన పసుపు కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు అల్లు అర్జున్ బాధ పడుతూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో వీడియో ని షేర్ చేశాడు. […]

Allu Arjun Valentines Day video: ఒక పక్క తన తమ్ముడు పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతుంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మాత్రం ముంబై లో అట్లీ మూవీ షూటింగ్ తో క్షణ కాలం తీరిక లేక గడుపుతున్నాడు. ఈ సందర్భంగా నిన్న ఏర్పాటు చేసిన పసుపు కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు అల్లు అర్జున్ బాధ పడుతూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో వీడియో ని షేర్ చేశాడు. ఇది కాసేపు పక్కన పెడితే ఆయన కొంతమంది నెటిజెన్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా చెప్పిన కొన్ని మాటలను కూడా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీ గా షేర్ చేశాడు. ఒక నెటిజెన్ అమ్మాయి గురించి మాట్లాడుతూ ‘మన కోసం ఒక అమ్మాయి ఉంటుంది చూడు సార్. నా దగ్గర డబ్బులు లేవు, బట్టలు లేవు ,పండగకి నేనేమి కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నేను కొనిపిస్త అని కొనడం, అప్పులతో ఇబ్బంది పడుతున్నప్పుడు నేనిస్తాను అని ముందుకు రావడం, అలాంటి భరోసా ఇచ్చే అమ్మాయి ఉంటుంది చూడండి సార్, అలాంటి అమ్మాయి ఉన్నోడు అదృష్టవంతుడు’ అని అంటాడు.

ఈ వీడియో ని అల్లు అర్జున్ షేర్ చేస్తూ ‘నాకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది. దీనిని సేవ్ చేసుకొని వాలెంటైన్స్ డే సందర్భంగా నేడు మీతో షేర్ చేసుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ఇలా ఒకటి కాదు, ఏకంగా రెండు మూడు స్టోరీలను తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు అల్లు అర్జున్. అంత పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయినప్పటికి, ఒక సాధారణ మనిషి లాగా సోషల్ మీడియా లో షేర్ చేయడాన్ని చూసిన అభిమానులు, అల్లు అర్జున్ సింప్లిసిటీ ని చూసి మురిసిపోతున్నారు. ఇలాంటి మంచి వ్యక్తి పై ఈమధ్య కాలం లో కొంతమంది పనిగట్టుకొని ’42 రూల్స్’ అంటూ ఇష్టమొచ్చినట్టు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన అట్లీ తో చేస్తున్న చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మే చివరి లోపు పూర్తి చెయ్యాలని చూస్తున్నాడు. ఆ తర్వాత ఆయన లోకేష్ కనకరాజ్ తో చేయబోయే సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ రెండు చిత్రాలకు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఉంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ నెలలో అట్లీ మూవీ కి సంబంధించిన టైటిల్ మరియు టీజర్ ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.

 

View this post on Instagram

 

A post shared by PJ (@memes__.moawa)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper