
Allu Arjun Remuneration: పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న హీరోల లిస్ట్ తీస్తే అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాప్ 1 స్థానం లో ఉంటాడు.మొదటి నుండే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవెల్ లో ఫేమ్ ఉంది.’పుష్ప’ సినిమాతో ఆ క్రేజ్ వంద రెట్లు పెరిగింది.ఇప్పుడు ఏ హీరో కి అయినా పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ రావాలంటే రాజమౌళి తోనో లేదా ప్రశాంత్ నీల్ తోనో సినిమాలు చెయ్యాలి.
కానీ అల్లు అర్జున్ వాళ్ళ సహాయం ఏమాత్రం తీసుకోకుండా తన సొంతం గా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద జెండా నాటేసాడు.ఇప్పుడు ఆయనకీ ఉన్న క్రేజ్ కి డిమాండ్ కి ఎంత డిమాండ్ చేసిన పారితోషికంగా ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సిద్ధం గా ఉన్నారు.రీసెంట్ గానే ఆయన సందీప్ రెడ్డి వంగా తో ఒక సినిమా చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Groom fell Asleep: మద్యం మత్తులో మండపంలోనే నిద్రపోయిన వరుడు.. చివరకు ఏం జరిగింది?
T సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించబోతోంది.ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న అల్లు అర్జున్, ఈ సినిమా పూర్తి అవ్వగానే సందీప్ రెడ్డి వంగతో చేతులు కలుపుతాడు.అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను అల్లు అర్జున్ కి 125 కోట్ల రూపాయిల పారితోషికం ఇస్తున్నారట.ఈ స్థాయి రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఇండియా లో ఏ హీరో కూడా తీసుకోవడం లేదు.

ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా వంద కోట్ల రూపాయిల రేంజ్ లోనే ఉంటుంది.ఇక రామ్ చరణ్ కూడా ఇంచు మించు అదే రేంజ్ లో తీసుకున్నాడు ప్రస్తుతం శంకర్ తో చేస్తున్న సినిమా కోసం.ఇక రీజినల్ హీరోలైన పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు వంటి వారు 70 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.అయితే వీళ్లిందరికంటే అల్లు అర్జున్ ఇప్పుడు 125 కోట్లు అందుకునే రేంజ్ కి ఎదగడం పెద్ద చర్చకి దారి తీసింది.
Also Read: Indians won Oscars: ఇప్పటివరకు ఎంతమంది భారతీయులు ఆస్కార్ గెలుచుకున్నారంటే