Homeఆంధ్రప్రదేశ్‌YCP irregularities in MLC election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు..! - ఎన్నికల సంఘానికి...

YCP irregularities in MLC election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు..! – ఎన్నికల సంఘానికి లేఖ రాసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు


YCP irregularities in MLC election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్న అధికార పార్టీ వైసిపి పై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీంతో అధికార పార్టీ అక్రమాలపై టిడిపి అధినేత ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్న అధికార పార్టీ దురాగతాలపై చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వైసిపి నేతలతో అధికారులు కుమ్మక్కై భోగస్ ఓట్లు నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బోగస్, నకిలీ ఓట్లను ఓటర్లు జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహస్యం అవుతోందని మండిపడ్డారు. తక్షణం అధికార పార్టీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

రేపే ఎన్నికలు..
రాష్ట్రవ్యాప్తంగా పలు ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల నమోదు విషయంలో టిడిపి కొంతకాలంగా అధికార వైసిపి పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ ఆరోపణలను ప్రభుత్వ సలహాదారు సజ్జల ఖండించారు. ఆ అవసరం తమకు లేదని, టిడిపి ముందుగానే ఓటమికి సాకులు వెతుకుతోందని కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు చీఫ్ ఎన్నికల కమిషనర్ కు రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. డిగ్రీ చదవని వ్యక్తులు, నకిలీ సర్టిఫికెట్లతో ఓటర్ గా నమోదు అయ్యారని పేర్కొన్నారు. గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. ఇప్పటికే ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అనర్హులను చేర్చినట్లు సాక్షాధారాలను కూడా లేఖలో జత చేశారు.

ప్రతి ఉప ఎన్నికల్లో కూడా..

గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లోను భాగస్వాట్లు ఇదే రకంగా చేర్చారని లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం అంతే పునరావృతం చేసే దిశగా వైసిపి పని చేస్తోందని స్పష్టం చేశారు. తప్పుడు చిరునామాలతో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చారని ఫిర్యాదులో చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా చేరారని ఆరోపించారు. కొందరు అధికారులు నకిలీ పత్రాలపై పరిశీలన జరుపుకుండానే ఉద్దేశపూర్వకంగానే ఆమోదం తెలిపారని చంద్రబాబు లేఖలో స్పష్టం చేశారు. వాళ్లు ప్రాంతాల్లో బోగస్త్ హోటల్ తంతు ఉందని, దీనికి సహకరించిన వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆ లేఖలో కోరారు.

RELATED ARTICLES

Most Popular