
Indians won Oscars: వజ్రాల్లో కోహినూర్ కు ప్రత్యేక స్థానం.. పువ్వుల్లో కుంకుమపువ్వు ది ప్రత్యేక పరిమళం. సినిమాకు సంబంధించిన పురస్కారాల్లో ఆస్కార్ కు ప్రత్యేకమైన స్థానం.. ప్రతి ఏటా మార్చి మొదటి వారంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ ధియేటర్ లో అకాడమీ అవార్డులు అందజేస్తూ ఉంటారు.. ఈ అవార్డుల కోసం దేశ, విదేశాల నుంచి ఎన్నో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి.. అయితే ఇప్పటివరకు సింహభాగం పురస్కారాలు హాలీవుడ్ సినిమాలే దక్కించుకున్నాయి. కానీ అప్పుడప్పుడు విదేశాలకు సంబంధించిన సినిమాలు కూడా పురస్కారాలు గెలుచుకుంటాయి.. ఇంక ప్రస్తుతం అకాడమీ అవార్డు రేసులో త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట పోటీ పడబోతోంది.. ఈ సినిమాకు అవార్డు వస్తుందా లేదా అనేది రేపటి నాడు తేలుతుంది.. అవార్డురేస్ లోకి భారతీయ సినిమాకు సంబంధించిన పాట వెళ్లడం ఇది మొదటిసారి కాదు.. గతంలో భారతీయ పాటలకు ఆస్కార్ పురస్కారం లభించింది.
భారత్ నుంచి తొలి ఆస్కార్ విన్నర్ గా భాను అథైయా విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. 1983లో విడుదలైన గాంధీ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా ఆమెకు అరుదైన ఘనత దక్కింది. 55వ ఆస్కార్ వేడుకల్లో ఆమె అవార్డు అందుకున్నారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
భారతీయ సినిమా పరిశ్రమకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వారిలో సత్య జీత్ రే ఒకరు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి 1992లో ఆస్కార్ హానరరి పురస్కారం అందజేసింది. అయితే అనారోగ్య కారణాలవల్ల ఆయన ఆ వేడుకకు హాజరు కాలేదు. దీంతో ఆస్కార్ అవార్డు కమిటీ స్వయంగా ఆసుపత్రికి వచ్చి ఆయనకు అవార్డు అందజేసింది.

ఇక బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డులు సాధించి రికార్డు సృష్టించారు. స్లం డాగ్ మిలియనీర్ సినిమాకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ అవార్డులు దక్కించుకున్నారు.. రెండు ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న తొలి భారతీయుడుగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ఇక ఇదే స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
దర్శకుడిగా, సినీ నిర్మాతగా, పాటల రచయితగా భారతీయ సినిమా పరిశ్రమకు విశేష సేవలు అందించిన గుల్జర్ 81వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకున్నాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు ఉత్తమ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆయనను ఆస్కార్ వరించింది.
ఇక ఢిల్లీకి చెందిన ప్రముఖ నిర్మాత గునిత్ మోన్గా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఆమె నిర్మించిన పీరియడ్ అండ్ ఆఫ్ సెంటెన్స్ కు ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం పురస్కారం లభించింది.
ఇక ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 95వ ఆస్కార్ అవార్డులు అందజేయనున్నారు. భారతదేశం నుంచి ఆల్ దట్ బ్రెత్స్(బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం), ది ఎలిఫెంట్ విస్పరర్స్(బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం), నాటు నాటు( బెస్ట్ ఒరిజినల్ సాంగ్) విభాగాలలో నామినేట్ అయ్యాయి.. అయితే ఈ అవార్డుల ప్రదానం సందర్భంగా అందరికళ్ళు ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు మీదనే ఉన్నాయి. కచ్చితంగా అవార్డు వస్తుందని అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.. ఇప్పటికే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని దక్కించుకుంది.. మరోవైపు ఆస్కార్ వేడుకల కోసం ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం అమెరికా చేరుకుంది.