Allu Arjun Arrested: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాసేపటి క్రితమే చంచల్ గూడా జైలు నుండి విడుదల అయ్యాడు. మెయిన్ గేట్ నుండి బయటకి పంపితే అభిమానుల తాకిడి, అదే విధంగా మీడియా కవరేజ్ ఉంటుందని ఆయన్ని వెనుక గేట్ నుండి బయటకు ఎస్కార్ట్ ద్వారా పంపారని తెలుస్తుంది. అంతే కాకుండా అల్లు అర్జున్ ఇంటి వద్ద కూడా భారీ సెక్యూరిటీ ని ఏర్పాటు చేసారు పోలీసులు. అభిమానులు వందల సంఖ్యలో అల్లు అర్జున్ ఇంటి వద్ద చేరుకొని అర్థ రాత్రి నుండి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉన్నందున ముందుగానే సెక్యూరిటీ ని ఏర్పాటు చేసారు. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ని ఉద్దేశపూర్వకంగానే రాత్రంతా జైలులో పెట్టారని, ఇదంతా చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందికి గురి చేసాడని అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడా?, ప్రెస్ మీట్ ద్వారా ఆయన ప్రభుత్వం తనపై వ్యవహరించిన తీరుపై మండిపడనున్నాడా?, నిన్న ఉదయం పోలీసులు అతని ఇంటికి వచ్చినప్పుడు చాలా అసహనంతో అల్లు అర్జున్ మాట్లాడడం మనమంతా చూసాము. ఎదో మర్డర్ చేసిన వాడిలాగా తనని ట్రీట్ చేసినట్టు అల్లు అర్జున్ ఆరోపించాడు. నన్ను జైలుకి తీసుకొని వెళ్లడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ దానికి ఒక పద్దతి అనేది ఉంటుంది. నేనేదో పారిపోతున్నట్టు నేరుగా నా బెడ్ రూమ్ లోకి రావడం. బట్టలు మార్చుకొని వస్తాను అని చెప్పినా వినకపోవడం. డోర్ లాక్ చేసుకోకుండా మీ ముందే బట్టలు మార్చుకోవాలని ఆదేశాలు ఇవ్వడం, ఇది మంచిది కాదు, చాలా తప్పు అంటూ అల్లు అర్జున్ పోలీసులను తప్పుపట్టిన వీడియోని నిన్న మనమంతా చూసాము. దీనిపై సినీ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా స్పందించారు. జరిగిన ఈ సంఘటనలో అందరి పొరపాటు ఉంది కేవలం అల్లు అర్జున్ ని తప్పుబట్టడం అన్యాయం అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేసారు.
మాజీ సీఎం జగన్, నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ రష్మిక మందన తదితరులు ఈ విషయంపై స్పందించగా, దిల్ రాజు, సూర్య దేవర నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు నేరుగా హై కోర్టు కి అల్లు అర్జున్ కోసం వచ్చారు. మరోపక్క చిరంజీవి, నాగబాబు వంటి వారు అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని , అతని కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. చిరంజీవి కుటుంబానికి దశాబ్దాల నుండి అత్యంత సన్నిహితంగా ఉన్న న్యాయవాది నిరంజన్ రెడ్డి కారణంగానే అల్లు అర్జున్ విడుదల అయ్యారట. బైలు కాపీలు తమకి అందకపోవడం వల్లే రాత్రంతా జైలులో ఉంచాల్సిన అవసరం వచ్చిందంటూ పోలీసులు మీడియా కి నిన్న రాత్రి తెలిపారు. మరి అల్లు అర్జున్ ఈ వ్యవహారాలపై స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.