https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : విన్నర్ ఓటింగ్ ముగిసింది..నిఖిల్, గౌతమ్ ఫ్యాన్స్ కి కోలుకోలేని షాక్..అధికారికంగా టాప్ లో ఎవరున్నారంటే!

బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ ని ఎవరు గెలవబోతున్నారు అని ఆడియన్స్ లో ఏర్పడిన ఉత్కంఠ కి మరి కొద్ది గంటల్లో తెరపడనుంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 14, 2024 / 08:19 AM IST

    Nikhil , Gautham

    Follow us on

    Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ ని ఎవరు గెలవబోతున్నారు అని ఆడియన్స్ లో ఏర్పడిన ఉత్కంఠ కి మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. నేడు రాత్రి సమయం ముగిసేసరికి, టైటిల్ విన్నర్ ఎవరో లీక్ అయిపోతుంది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరగబోతుందట. ఇప్పటికే ఈ షూటింగ్ లో పాల్గొనేందుకు పాత కంటెస్టెంట్స్ అందరూ తమ ఊర్ల నుండి హైదరాబాద్ కి వచ్చేసారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే నిన్న అర్థ రాత్రి 12 గంటలకు టైటిల్ విన్నర్ ఓటింగ్ ముగిసింది. సోషల్ మీడియా ఓటింగ్స్ ప్రకారం చూస్తే నిఖిల్ యూట్యూబ్ లో ఎవ్వరికీ అందనంత రేంజ్ లో ఉన్నాడు. మొదటి స్థానంలో నిఖిల్ కొనసాగుతుండగా, రెండవ స్థానంలో గౌతమ్ కొనసాగుతున్నాడు. ఇక మూడవ స్థానంలో ప్రేరణ, నాల్గవ స్థానంలో నబీల్ ఉన్నారు.

    ఇది కేవలం యూట్యూబ్ పోల్స్ మాత్రమే. నిఖిల్ కి గౌతమ్ కి మధ్య యూట్యూబ్ పోల్స్ కి కనీసం 50 శాతం తేడా ఉంది. ఇది మామూలు రేంజ్ లీడింగ్ కాదు. దీనిని చూసి నిఖిలే టైటిల్ గెలవబోతున్నాడు అనుకుంటే పెద్ద పొరపాటే. యూట్యూబ్ లో నిఖిల్ గౌతమ్ పై ఏ రేంజ్ లీడింగ్ లో ఉన్నాడో, గౌతమ్ కూడా నిఖిల్ పై అదే రేంజ్ లీడింగ్ తో ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, వెబ్ సైట్స్ పోల్స్ లో ఉన్నాడు. వెబ్ సైట్స్ లో అయితే గౌతమ్ కి నిఖిల్ దరిదాపుల్లో కూడా లేడు. దీనిని చూసి గౌతమ్ ఫ్యాన్స్ కూడా గౌతమే టైటిల్ విన్నర్ గా నిలుస్తాడు అని అనుకున్నా పొరపాటే. ఎందుకంటే అధికారిక ఓటింగ్ ఈ ఇరువురి కంటెస్టెంట్స్ అభిమానులు అనుకున్నట్టుగా లేదు. నిఖిల్, గౌతమ్ మధ్య అధికారిక ఓటింగ్ నువ్వా నేనా అనే రేంజ్ లో హోరాహోరీగా జరిగింది.

    నిన్న ఉదయం 11 గంటలకు వచ్చిన అప్డేట్ ఏమిటంటే నిఖిల్ కంటే గౌతమ్ 0.03 శాతం ఓట్ల తేడాతో లీడింగ్ లో ఉన్నాడని, ప్రస్తుతం టైటిల్ గెలిచే అవకాశాలు గౌతమ్ కి ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. కానీ ఓటింగ్ ముగిసే సమయానికి ఇద్దరిలో ఎవరో ఒకరి వైపు గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. ఇద్దరిలో ఎవరైనా గెలవొచ్చు. ఇక మూడవ స్థానంలో ప్రేరణ కొనసాగుతుండగా, నాలుగు, ఐదు స్థానాల్లో నబీల్, అవినాష్ కొనసాగుతున్నారు. ప్రేరణకి సోషల్ మీడియా ఓటింగ్స్ లో నిఖిల్, గౌతమ్ తో పోలిస్తే చాలా ఓటింగ్ తేడా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ, అధికారికంగా ఆమెకి కూడా చాలా బలమైన ఓట్లు పడ్డాయని అంటున్నారు. మధ్యలో కొన్ని నెగటివ్ ఎపిసోడ్స్ పడడం వల్ల ఆమె టైటిల్ రేస్ నుండి తప్పుకుంది కానీ, లేకుంటే మొట్టమొదటి లేడీ టైటిల్ విన్నర్ అయ్యేదని విశ్లేషకులు సైతం నిన్న ఆమె జర్నీ వీడియో చూసిన తర్వాత అంటున్నారు.