https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : అవినాష్ కోసం నబీల్ కి బిగ్ బాస్ అన్యాయం చేయబోతున్నాడా..? చివరి నిమిషంలో షాకింగ్ ట్విస్ట్!

ఈ సీజన్ లో మొదటి వారం నుండి నిఖిల్ కి ఒక రేంజ్ లో పోటీని ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నబీల్ మాత్రమే. ఒకానొక దశలో నబీల్ ఓటింగ్ ని చూసి నిఖిల్ ఫ్యాన్స్ కి దడ పుట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 14, 2024 / 08:12 AM IST

    Nabeel

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ లో మొదటి వారం నుండి నిఖిల్ కి ఒక రేంజ్ లో పోటీని ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నబీల్ మాత్రమే. ఒకానొక దశలో నబీల్ ఓటింగ్ ని చూసి నిఖిల్ ఫ్యాన్స్ కి దడ పుట్టింది. యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, వెబ్ సైట్స్ ఇలా ఎక్కడ చూసినా నబీల్ నిఖిల్ మీద ఒకప్పుడు టాప్ లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి అడుగుపెట్టారో, అప్పటి నుండి నబీల్ గ్రాఫ్ వారం వారంకి తగ్గుతూ పోయింది. ఆయనలో ఫైర్ బాగా తగ్గిపోయింది అనేది వాస్తవం. ఇది నబీల్ తగ్గలేదు అని ఎంత తనని తాను డిఫెండ్ చేసుకున్నా, ఈ నిజాన్ని మార్చలేడు. అయితే నబీల్ ఒక అద్భుతమైన ఎంటర్టైనర్. ఈ సీజన్ లో ఎక్కువగా అవినాష్ మాత్రమే ఎంటర్టైనర్ అన్నట్టుగా చూపించారు కానీ, నబీల్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని బిగ్ బాస్ టీం ఎక్కువగా వాడుకోలేదు.

    కేవలం అవినాష్ కోసమే అతన్ని తొక్కేశారు అనిపించింది. ఇప్పటి వరకు నబీల్ చేసిన కామెడీ చాలా వరకు క్లిక్ అయ్యింది. ముఖ్యంగా అవినాష్ తో అతను కలిసి చేసిన కొన్ని స్కిట్స్ బాగా పేలాయి. అతని డైలాగ్ మోడ్యులేషన్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించేలా చేసింది. కానీ బిగ్ బాస్ ఎంతసేపు కామెడీ టాస్కులు అంటే అవినాష్, రోహిణి, తేజ మాత్రమే చెయ్యగలరు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసాడు. ఇది కచ్చితంగా నబీల్ కి అన్యాయం చేయడమే. అందుతున్న సమాచారం ప్రకారం అవినాష్ ని ముందుకు నెట్టడానికి నబీల్ కి బిగ్ బాస్ టీం మరో ఘోరమైన అన్యాయం చేయబోతున్నట్టు సమాచారం అందుతుంది. వివరాల్లోకి వెళ్తే అధికారిక ఓటింగ్ ప్రకారం అవినాష్ 5వ స్థానం లో ఉన్నాడు. సోషల్ మీడియా లో ఓటింగ్స్ లో కూడా ఇదే ట్రెండ్ ఉంది.

    కానీ అవినాష్ కి తక్కువ ఓటింగ్ పడింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అతనికి కూడా నబీల్ తో దాదాపుగా సరిసమానమైన ఓటింగ్ పడింది. ఇద్దరి మధ్య పెద్దగా తేడా ఏమి లేదు, కానీ బిగ్ బాస్ టీం నబీల్ ని 5వ స్థానంలో బయటకి పంపి, అవినాష్ ని నాల్గవ స్థానంలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అంతే కాదు నాల్గవ స్థానంలో అవినాష్ ని నిలిపి, అతని చేతిలో పది లక్షల రూపాయిల సూట్ కేసు పెట్టాలని అనుకుంటున్నారట. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ మా ఛానల్ కి అవినాష్ బయటకి వచ్చిన తర్వాత అతనితో చాలా పని ఉంది. ఎన్నో ఈవెంట్స్ కి అవినాష్ ని వాడుకోవచ్చు, కానీ నబీల్ అవసరం స్టార్ మా ఛానల్ కి అంతగా లేదు, అందుకే కావాలని అతనికి అన్యాయం చేసే కుట్ర జరగబోతుందని నబీల్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.